ఆమిర్ లైనప్ లో పది సినిమాలా?
దినేష్ విజన్ తో కలిసి నిర్మాతగా ఉజ్జల్ నికమ్ బయోపిక్ తో పాటూ రాజ్ కుమార్ సంతోషితో ఓ సినిమా చేయనున్నాడు.
By: Tupaki Desk | 4 Jun 2025 8:34 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆమిర్ నటించిన సితారే జమీన్ పర్ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 20న సితారే జమీన్ పర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న ఆమిర్ ఖాన్ చిత్ర ప్రమోషన్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలు విషయాలను వెల్లడిస్తున్నాడు. అందులో భాగంగానే తాను పలువురు అగ్ర ఫిల్మ్ మేకర్స్ తో స్క్రిప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నానని, సితారే జమీన్ పర్ తర్వాత తన లైనప్ లో పది ప్రాజెక్టులున్నాయని తెలిపారు. అయితే ఆమిర్ చెప్పిన పది సినిమాలూ కేవలం హీరోగానే కాదు, నిర్మాతగా కూడా. ఈ పది సినిమాల్లో కొన్ని స్క్రిప్ట్ దశలో ఉంటే మరికొన్నిప్రీ ప్రొడక్ష్ దశలో ఉన్నాయట.
సితారే జమీన్ పర్ తర్వాత ఆమిర్ ఖాన్ చేయనున్న సినిమాల గురించి, ప్రస్తుతం డిస్కషన్స్ లో సినిమాల గురించి రీసెంట్ గా ఆయన వెల్లడించాడు. ఈ సినిమా తర్వాత రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్ చేయనున్నాడు ఆమిర్ ఖాన్. దీంతో పాటూ అనురాగ్ బసు దర్శకత్వంలో కిషోర్ కుమార్ బయోపిక్ ను ఆమిర్ లైన్ లో పెట్టాడు.
దినేష్ విజన్ తో కలిసి నిర్మాతగా ఉజ్జల్ నికమ్ బయోపిక్ తో పాటూ రాజ్ కుమార్ సంతోషితో ఓ సినిమా చేయనున్నాడు. టీ సిరీస్ తో కలిసి నిర్మాతగా గుల్షన్ కుమార్ బయోపిక్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి ఆమిర్ ఓ సినిమా కోసం వర్క్ చేసే ఛాన్సున్నట్టు చెప్పాడు. వీటితో పాటూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సూపర్‌హీరో ఫిల్మ్ తో పాటూ వంశీ పైడిపల్లితో ఓ సినిమా, రణ్‌బీర్ కపూర్ తో కలిసి పీకే2 మరియు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో నిర్మాతగా ఓ సినిమా చేయడానికి ప్రస్తుతం డిస్కషన్స్ చేస్తున్నట్టు ఆమిర్ వెల్లడించాడు. మరి ఆమిర్ డిస్కషన్స్ చేస్తున్న ఈ సినిమాల్లో ఎన్ని సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి.
