Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ లాయర్‌ కాబోవడం లేదు..!

సితారే జమీన్‌ పర్ సినిమా ముగింపు దశకు చేరుకున్న సమయంలోనే ఆమీర్ ఖాన్‌ ఒక బయోపిక్‌కు ఓకే చెప్పాడు.

By:  Tupaki Desk   |   17 April 2025 7:18 AM
Aamir Khan Opts Out On
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ ప్రస్తుతం తారే జమీన్ పర్ కి సీక్వెల్‌గా రూపొందుతున్న 'సితారే జమీన్ పర్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఆ సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ నటించబోతున్న సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమీర్ ఖాన్‌ సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుని చాలా ఏళ్లు అవుతుంది. కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం ఆమీర్ ఖాన్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సితారే జమీన్ పర్‌ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఆ సినిమా ఆమీర్‌ ఖాన్ ఫ్యాన్స్ ఆశిస్తున్న స్థాయిలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు కనిపించడం లేదు అనేది బాలీవుడ్ మీడియా వర్గాల అభిప్రాయం.

సితారే జమీన్‌ పర్ సినిమా ముగింపు దశకు చేరుకున్న సమయంలోనే ఆమీర్ ఖాన్‌ ఒక బయోపిక్‌కు ఓకే చెప్పాడు. దేశంలోనే ప్రముఖ లాయర్‌గా పేరునన్ ఉజ్వల్‌ నికం జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ను తీయాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆయన గురించి తెలిసిన ఆమీర్ ఖాన్ ఉజ్వల్‌ నికం పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడు. స్క్రిప్ట్‌ వర్క్ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. కసినిమా షూటింగ్‌ ఇదే ఏడాది చివరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా సినిమా ఆగిపోయిందని, స్క్రిప్ట్‌ సమయంలో దర్శకుడితో ఆమీర్‌ ఖాన్‌ విభేదించడంతో ప్రాజెక్ట్‌ సైడ్ అయిందనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే మేకర్స్‌కి ఆమీర్‌ ఖాన్ తప్పుకుంటున్నట్లు చెప్పేశాడట. అందుకు కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆమీర్ ఖాన్‌ నో చెప్పడంతో ఉజ్వల్‌ బయోపిక్‌ను పక్కకు పెట్టకుండా నిర్మాతలు మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆమీర్‌ ఖాన్‌ చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్న ఈ సినిమాను మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో చేయించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో బయోపిక్‌లకు అంతగా ఆధరణ లేదు. కనుక స్టార్‌ హీరోలు ఈ సాహసోపేతమైన ప్రాజెక్ట్‌ను చేసేందుకు ఆసక్తి చూపిస్తారా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే దర్శకుడు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేస్తాడా అనేది చూడాలి.

ఉజ్వల్‌ నికం 1953లో జన్మించారు. ఉగ్రవాద కేసులు, బాంబు దాడులు, గుల్జన్‌ కుమార్‌ హత్య కేసు, ప్రమోద్‌ మహాజన్‌ హత్య కేసు, 2008 ముంబై దాడుల్లో నిందితులను విచారించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2013 ముంబై సామూహిక అత్యాచారం ఇలా ఎన్నో కేసుల్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. నేరం చేసిన వారికి కఠిన శిక్షలు పడే విధంగా కోర్టులో వారి తప్పులను చూపించారు. న్యాయస్థానం ముందు వారిని దోషులుగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అంతటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సినిమా రూపంలో తీసుకు వస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కుతుందనే అభిప్రాయంతో ఈ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టారు. ఇలాంటి వ్యక్తి పాత్రను ఆమీర్‌ పోషిస్తే కచ్చితంగా బాగుండేది. కానీ ఆమీర్‌ అందుకు నిరాకరించడంతో బయోపిక్‌ అవసరమా అనే అభిప్రాయంను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్‌ ఈ విషయమై తదుపరి తీసుకోబోతున్న స్టెప్స్‌ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.