Begin typing your search above and press return to search.

అమీర్ ప్రయత్నం రాజమౌళిని ఆపలేదు !

కానీ ఇప్పుడు తాజా ప‌రిణామాలు చూస్తుంటే రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్టును మ‌రొక‌రు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 April 2025 6:03 AM
అమీర్ ప్రయత్నం రాజమౌళిని ఆపలేదు !
X

ఇండియ‌న్ సినిమాలో మ‌హాభార‌తం లాంటి హిందూ మైథాలిజిక‌ల్ యాక్ష‌న్ ను తెర‌కెక్కించ‌డానికి రాజ‌మౌళి కంటే బెట‌ర్ డైరెక్ట‌ర్ మ‌రొక‌రు ఉండ‌ర‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పొచ్చు. మ‌హాభార‌తం ను ఐదు భాగాల ఫ్రాంచైజ్ గా తెర‌కెక్కిస్తానని, ఆల్రెడీ దానిపై త‌న‌కు ఇప్ప‌టికే ఓ ప్లాన్ ఉంద‌ని, త‌న సినిమాల్లో ఆఖ‌రిగా మ‌హాభార‌త‌మే వ‌స్తుంద‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే స్వ‌యంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

కానీ ఇప్పుడు తాజా ప‌రిణామాలు చూస్తుంటే రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్టును మ‌రొక‌రు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఏ మాత్రం రాజ‌మౌళి ప్ర‌మేయం లేకుండా. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ ఇంట‌ర్వ్య‌లో మాట్లాడుతూ త‌న నిర్మాణంలో మ‌హాభార‌తం ఆధారంగా ఓ సినిమా రానుంద‌ని, ఈ సంవ‌త్స‌ర‌మే ఆ ప్రాజెక్టు ప్రొడ‌క్ష‌న్ లోకి వెళ్ల‌నుంద‌ని, ఎంతో భారీగా మ‌హాభార‌తం ప్రాజెక్టు తెర‌కెక్క‌నుంద‌ని వెల్ల‌డించారు.

ఈ ప్రాజెక్టు ప‌లు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ని, ప‌లువురు డైరెక్ట‌ర్లు దీని కోసం వ‌ర్క్ చేయ‌నున్నార‌ని, అన్ని భాగాల షూటింగ్ ఒకేసారి మొద‌ల‌వుతుందని, భారీ స్థాయిలో వాటిని రూపొందించనున్నట్టు అమీర్ తెలిపారు. పాత్ర‌ల సారూప్య‌త‌ల ఆధారంగా న‌టీన‌టుల‌ను సెలెక్ట్ చేయ‌నున్నామ‌ని కూడా అమీర్ చెప్పారు. అయితే అమీర్ ప్రొడ‌క్ష‌న్ కాబ‌ట్టి దేశంలోని స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగ‌మ‌య్యే ఛాన్సుంది.

అయితే అమీర్ తెర‌కెక్కించే ఈ ప్రాజెక్టు స‌క్సెస్‌ఫుల్ గా తెర‌కెక్కి ఆడియ‌న్స్ ను మెప్పిస్తే అది రాజ‌మౌళి తీయ‌బోయే సినిమాపై క‌చ్ఛితంగా ఎఫెక్ట్ చూపే అవ‌కాశ‌ముంది. రాజ‌మౌళి తెరకెక్కించిన‌ట్టు మ‌హాభార‌తాన్ని మ‌రెవ‌రూ తీయ‌లేక‌పోయినా ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ లో వ‌చ్చే మొద‌టి సినిమాగా అమీర్ ప్రాజెక్టు కు మంచి లాభం చేకూరే అవ‌కాశ‌ముంది.

ఆల్రెడీ మ‌హాభారతంపై అమీర్ ఖాన్ నుంచి సినిమా వ‌స్తుంది కాబ‌ట్టి రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ను వ‌దులుకుంటార‌ని చెప్ప‌లేం. ఎందుకంటే మ‌హాభార‌తమ‌నేది ఓ మ‌హా స‌ముద్రం. రాజ‌మౌళికి ఉన్న టాలెంట్ కు అత‌ను ఏ చిన్న పాయింట్ ను తీసుకోనైనా ఓ పెద్ద ఫ్రాంచైజ్ ను సృష్టించ‌గ‌ల‌డనేది తెలిసిందే. కాక‌పోతే త‌న డ్రీమ్ ప్రాజెక్టును నిర్మించ‌డానికి కాస్త టైమ్ తీసుకుంటాడ‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి మ‌హాభార‌తంపై సినిమా చేస్తే దాన్ని మించిన సినిమా మ‌రోటి ఉండ‌ద‌ని చెప్పొచ్చు.