Begin typing your search above and press return to search.

కంటెంట్‌ పై నమ్మకం లేదా ఆమీర్ జీ..?

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ గత దశాబ్ద కాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2025 12:54 PM IST
Aamir Khans Sitaare Zameen Par Faces Release Date Dilemma
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ గత దశాబ్ద కాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. గడచిన పదేళ్ల కాలంలో ఆరంభంలో దంగల్‌, సీక్రెట్‌ సూపర్ స్టార్‌ సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న అమీర్ ఖాన్‌ ఆ తర్వాత చేసిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు. చివరగా ఆమీర్ ఖాన్‌ నుంచి వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌, లాల్ సింగ్ చద్దా సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకే ఆమీర్‌ ఖాన్‌ తదుపరి సినిమా విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు, అంతేకాకుండా ఎక్కువగా భయపడుతున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి ఆమీర్‌ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'సీతారే జమీన్ పర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందుతున్న సీతారే జమీన్‌ పర్ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయి చాలా రోజులైంది. సినిమా షూటింగ్ తక్కువ సమయంలోనే పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమాను మొదట 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. కానీ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేయడంతో పాటు, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమీర్‌ ఖాన్‌ తన సినిమాను విడుదల చేయడం కోసం సరైన డేట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. సాధారణంగా స్టార్‌ హీరోలు పోటీ సమయంలో విడుదల చేసినా, ఇతర హీరోల సినిమాలు సైడ్‌ అవుతాయి. కానీ ఆమీర్ ఖాన్‌ సినిమా విషయంలో అలా జరగడం లేదు.

ఇతర సినిమాలకు భయపడి ఆమీర్‌ ఖాన్ తన 'సీతారే జమీన్‌ పర్‌'ను వాయిదా వేస్తూ వస్తున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ ఏప్రిల్‌ నెలలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండటంతో పాటు, ఇతర సినిమాల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. అందుకే ఆమీర్‌ ఖాన్‌ మే నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లు అన్ని పూర్తి అయిన తర్వాత క్రికెట్‌ పండుగ ముగిసిన తర్వాత అంటే మే చివరి వారంలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఆమీర్‌ ఖాన్‌ వంటి సూపర్ స్టార్‌ సినిమాకు విడుదల తేదీ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంపై పలువురు షాక్‌ అవుతున్నారు. కంటెంట్‌ పై నమ్మకం ఉంటే ఎందుకు ఇంతగా భయపడటం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమీర్ ఖాన్‌కి తన సీతారే జమీన్‌ పర్‌ సినిమా విషయంలో నమ్మకం లేదా అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సినిమాపై నమ్మకం ఉంటే కచ్చితంగా ఎంత పోటీ ఉన్నా, ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉన్నా అనుకున్న సమయంకు విడుదల చేస్తాడు. కానీ ఈ సినిమా విషయంలో ఆమీర్‌ ఖాన్‌ ఆచితూచి వ్యవహరించడంపై చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఆమె ఎంపికను చాలా మంది తప్పుబడుతున్నారు. ఆమీర్ ఖాన్‌ సైడ్‌ నుంచి మంచి సినిమాను మంచి సీజన్‌లో లేదా మంచి డేట్‌కి విడుదల చేయాలనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నామని అంటున్నారు. అసలు మ్యాటర్‌ ఏంటి అనేది సినిమా వచ్చాక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.