Begin typing your search above and press return to search.

సితారె జమీన్ పర్ టాక్ ఏంటి..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా సితారె జమీన్ పర్. 2007 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 11:46 PM IST
సితారె జమీన్ పర్ టాక్ ఏంటి..?
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా సితారె జమీన్ పర్. 2007 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఆఫ్టర్ ఇయర్స్ తారె జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా సితారె జమీన్ పర్ సినిమా వచ్చింది. ఆర్‌.ఎస్‌.ప్రసన్న డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ నుంచి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సితారె జమీన్ పర్ సినిమా వచ్చింది.

ఒకప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్లు ఇచ్చిన అమీర్ ఖాన్ సినిమా అంటే ఒక రేంజ్ లో బజ్ ఉండేది. కానీ సితారె జమీన్ పర్ సినిమాకు అసలేమాత్రం బజ్ లేదు. సినిమాకు బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. ఐతే ఇంతకీ సినిమా ఎలా ఉంది.. సినిమా టాక్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

సితారె జమీన్ పర్ కథ ఏంటంటే.. గుల్షన్ అరోరా (అమీర్ ఖాన్) ఢిల్లీ బాస్కెట్ బాల్ టీం అసిస్టెంట్ కోచ్ గా చేస్తుంటాడు. ఐతే హెడ్ కోచ్ తో తగువులాట వల్ల అతన్ని కొట్టి ఆ కోపంతో తాగి కారుతో పోలీస్ వెహికల్ ని యాక్సిడెంట్ చేస్తాడు. కోర్ట్ అతడికి సోషల్ సర్వీస్ కింద దివ్యాంగులకు 3 నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వమని ఆదేశిస్తుంది. ఐతే దివ్యాంగులకు కోచింగ్ ఇష్టం లేకపోయినా సరే 10 మంది మానసిక విద్యాంగులకు బాస్కెట్ బాల్ కోచ్ గా మారతాడు. వాళ్లకు అతను ఆట ఎలా నేపిస్తాడు.. వాళ్లతో నేషనల్ బాక్సెట్ బాల్ ఛాంపియన్ పోటీల్లో ఎలా పాల్గొన్నాడు..? ఫైనల్ గా ఏం జరిగింది అన్నది సితారె జమీన్ పర్ కథ.

తారె జమీ పర్ సినిమా అప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలను చూపించి వారి సమస్యని అధిగమించే కథతో తెరకెక్కించారు. ఐతే ఆ సినిమా తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ సితారె జమీన్ పర్ అంటూ దివ్యాంగుల కథతో వచ్చాడు అమీర్ ఖాన్. వయసు పెరిగినా ఇంకా చిన్న పిల్లల్లా ప్రవర్తించే వారు ఏదో ఒక లోపంతో దివ్యాంగులుగా ఉన్న వారిని తీసుకుని వారితో బాస్కెట్ బాల్ టీం ని తయారు చేసి అలా కథ నడిపించాడు దర్శకుడు.

సినిమా అంతా కూడా ఎంటర్టైనింగ్ గా సాగుతూ అక్కడక్కడ హృదయాన్ని తాకే మాటలతో ఉంటుంది. 10 మంది మానసిక విద్యాంగులకు కోచింగ్ ఇచ్చే సీన్స్ లో అమీర్ ఖాన్ పడే ఇబ్బందులతో మంచి ఫన్ వచ్చింది. ఆ సీన్స్ కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. ఐతే గుల్షన్ ఫ్యామిలీ సీన్స్ కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. ఫ్యామిలీ డ్రామా కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా తారె జమీన్ పర్ తరహాలో అమీర్ చేసిన సితారె జమీన్ పర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఐతే అక్కడక్కడ ఫ్యామిలీ సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి.

అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలిసిందే. జెనిలియా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా పాత్రదారులంతా కూడా మెప్పించారు. సినిమాలో డైలాగ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఐతే సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువ ఐనిపిస్తుంది. ఈ సినిమా స్పానిష్ సినిమా ఛాంపియన్ ని స్పూర్తిగా తీసుకుని కథ రాసుకున్నారు. కొన్ని సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది.