Begin typing your search above and press return to search.

రోజుకొక పుల్ బాటిల్...ర‌క్తంతో ప్రేమ‌లేఖ‌!

బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ వ్య‌క్తిగ‌త జీవితం కూడా తెరిచిన పుస్త‌క‌మే. ఇప్ప‌టికే ఆయ‌న‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడ‌వ పెళ్లికి రెడీ అవుతున్నారు. మొద‌టి భార్య రీనా ద‌త్తా.

By:  Tupaki Desk   |   1 July 2025 1:00 AM IST
రోజుకొక పుల్ బాటిల్...ర‌క్తంతో ప్రేమ‌లేఖ‌!
X

బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ వ్య‌క్తిగ‌త జీవితం కూడా తెరిచిన పుస్త‌క‌మే. ఇప్ప‌టికే ఆయ‌న‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడ‌వ పెళ్లికి రెడీ అవుతున్నారు. మొద‌టి భార్య రీనా ద‌త్తా. ఆ జంట‌కు కుమార్తె.. కొడుకు గ‌ల‌రు. కానీ కొంత కాలానికి కాపురంలో క‌ల‌త‌లు చోటు చేసుకోవ‌డంతో 16 ఏళ్ల త‌ర్వాత విడి పోయారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రీనా ద‌త్తా ప్రేమ కోసం అమీర్ ఖాన్ ఎంతగా ప‌రిత‌పించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

అమీర్ ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఏకంగా ర‌క్తంతోనే ప్రేమ లేఖ రాసిన గొప్ప ప్రేమ‌కథ‌గా తెలుస్తుంది. అమీర్ -రీనా ద‌త్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం అమీర్ ఖాన్ త‌న ర‌క్తంతో ప్రేమ‌లేఖ రాసారు. అయినా రీనా ద‌త్తా మన‌సు అంగీక‌రించ‌లేదు. కొంత స‌మయం తీసుకుని అప్పుడు అమీర్ ల‌వ్ ను అంగీక‌రించింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్నారు.

అమీర్ ఖాన్ మొద‌టి చిత్రం `ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్` లో చిన్న రోల్ కూడా పోషించింది. అయితే రీనా ద‌త్తా అమీర్ విడిపోయిన తొలి రోజు ఏకంగా ఒక పుల్ బాటిల్ మ‌ద్యం సేవించిన‌ట్లు అమీర్ తెలిపారు. ఆ త‌ర్వాత ఏడాది పాటు రోజు మ‌ద్యం తీసుకునే ప‌నిలోనే ఉన్నారుట‌. ఆ స‌మ‌యంలో నిద్ర పోలేదని..నిద్ర కూడా లేకుండా మ‌ద్యం తాగిన‌ట్లు తెలిపారు.

అధిక మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల స్పృహ కోల్పోయిన సంద‌ర్భాలెన్నో అన్నారు. ఒక స‌మ‌యంలో ఆత్మ హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న కూడా వ‌చ్చింద‌న్నారు. అదే ఏడాది `ల‌గాన్` రిలీజ్ అయింది. సినిమా విజ‌యం సాధించ‌డంతో `మ్యాన్ ఆఫ్ ది ఇయ‌ర్` అని కీర్తించినా అదెక్క‌డా త‌లెక్క‌లేద‌న్నారు. ఆ పిలుపు త‌న‌కో వ్యంగ్యంగా అనిపించింద‌న్నారు. అంత‌గా రీనా ద‌త్తాని అమీర్ ఖాన్ ప్రేమించారు.