అమీర్ ఖాన్ మళ్లీ రాజమౌళినే రిక్వెస్ట్ చేస్తాడా?
`మహభారాతం` తీయడానికి ఆసక్తిగా ఉన్నది ఎవరు? అంటే ఇండియాలో ఇద్దరి పేర్లు మాత్రమే వినిపి స్తాయి.
By: Tupaki Desk | 12 May 2025 7:17 AM`మహభారాతం` తీయడానికి ఆసక్తిగా ఉన్నది ఎవరు? అంటే ఇండియాలో ఇద్దరి పేర్లు మాత్రమే వినిపి స్తాయి. వాళ్లీ బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్...దర్శక శిఖరం రాజమౌళి. `మహాభారతం` సినిమాగా తీస్తామని ఇద్దరు ఇప్పటికే వేర్వేరుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాజమౌళి స్లోగా ఉన్నా? అమీర్ ఖాన్ మాత్రం ఎప్పటికప్పుడు అలెర్ట్ అవుతూ ఏదో అప్ డేట్ అందిస్తున్నారు.
ఇటీవలే `మహాభారతం`లో శ్రీకృష్ణ పాత్ర పోషిస్తానని వెల్లడించారు. రైటింగ్ పనులు కూడా మొదలైనట్లు తెలిపారు. కానీ దర్శకుడు ఎవరు? అన్నది చెప్పలేదు. అమీర్ ఖాన్ అవకాశం ఇస్తే బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లు అంతా క్యూలో ఉంటారు. కానీ వాళ్లకు అవకాశం ఇస్తాడా? లేదా? అన్నది చెప్పలేం. ఎందుకంటే? అమీర్ ఖాన్ మనసంతా రాజమౌళి మీదనే ఉంది. మహాభారతాన్ని ఆయన తీస్తేనే బాగుంటుందని బలంగా నమ్ము తున్నారు.
రాజమౌళితో సినిమా చేయాలని ఉందని అమీర్ చాలా కాలం క్రితమే ఓపెన్ అయ్యారు. నాతో కూడా ఓ సినిమా తీయండని ఎంతో వినయంగా అభ్యర్దించారు. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. కానీ రాజమౌళినే ఇంకా ఆఛాన్స్ తీసుకోలేదు. ఆయన కేవలం తెలుగులో హీరోలతోనే ముందుకెళ్తున్నారు. అయితే `మహాభారతం` అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించే దిశగా పావులు కదిపే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే అంతటి సమర్దుడు రాజమౌళి అని అమీర్ ఖాన్ ఎప్పుడూ బలంగా నమ్ముతారు. రాజమౌళి కూడా మహాభారతం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ చాన్స్ ఏదో నాతోనే తీసుకోండని అమీర్ రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రాజమౌళి మనసులో ఆ కథను తెలుగులో హీరోలతో చేయాలని ఉంది. మరి అభ్యర్ధిస్తే ఆయన మాట కాదనక పనిచేస్తారా? నిర్మోహమాటంగా మా వాళ్లతోనే చేస్తానని చెప్పేస్తారా? అన్నది అమీర్ స్టెప్ ని బట్టి ఉంటుంది. అప్పటి వరకూ వెయిటింగ్ తప్పదు.