ఆ స్టార్ హీరో హిట్ బాధ్యత ఆ ద్వయం తీసుకుందా!
ఈ వేడిని గమనించిన అమీర్ ఇప్పట్లో సినిమా చేస్తే నష్టమే తప్ప లాభం కాదని భావించి నిర్మాతగా మూవ్ అయ్యారు.
By: Tupaki Desk | 26 April 2025 11:05 AM ISTమిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి సరైన కమర్శియల్ సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. `దంగల్` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అమీర్ ఖాన్ ఇమేజ్ రెట్టింపు అయినా? అది ఎంత మాత్రం కలిసి రాలేదు. 'సీక్రెట్ సూపర్ స్టార్', 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్', 'లాల్ సింగ్ చడ్డా' చిత్రాలు రిలీజ్ అయినా? హిట్ చిత్రాలు కాకపోగా అమీర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన చిత్రాలుగా మారాయి. లాల్ సింగ్ చడ్డా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
ఈ వేడిని గమనించిన అమీర్ ఇప్పట్లో సినిమా చేస్తే నష్టమే తప్ప లాభం కాదని భావించి నిర్మాతగా మూవ్ అయ్యారు. అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే మ్యాకప్ వేసుకుంటున్నారు. త్వరలో `సితారే జమీన్ పార్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి కూడా అమీర్ నిర్మాతగా కొనసాగుతున్నారు. కానీ ఈ సిని మాపై ఎలాంటి బజ్ లేదు. అమీర్ కూడా బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. వ్యవహారమంతా కామ్ గానే నడుస్తోంది. అయితే అమీర్ ఖాన్ సక్సెస్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నడుం బిగించినట్లు కనిపిస్తుంది.
అమీర్ ఖాన్ తో ఓ భారీ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాదు అమీర్ కి ఓ బిగ్ కమర్శియల్ సక్సెస్ అందించాలని సదరు నిర్మాణ సంస్థ సీరియస్ గా ప్రయత్నాలు మొదలు పెట్టిందట. బయోపిక్ లు లాంటివి కాకుండా పక్కా పైసా వసూల్ కంటెంట్ ఉన్న చిత్రం చేయాలని...అలాంటి కథ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్రపోజల్ కు అమీర్ అంగీకరించారా? లేదా? అన్నది తేలాలి.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. `ఫరేరీ` చిత్రంతో మైత్రీ సంస్థ అక్కడ లాంచ్ అయింది. ఇటీవలే రిలీజ్ అయిన `జాట్` చిత్రాన్ని కూడా అదే సంస్థ నిర్మించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. సన్ని డియోల్ మరో హిట్ సినిమా అందించిన సంస్థగా నిలిచింది. తాజాగా మైత్రీ టార్గెట్ అమీర్ ఖాన్ అయ్యారు.
