స్టార్ హీరోకి షాక్ ఇక్ ఇచ్చిన 90 ఏళ్ల మామ్!
జీనత్ ఖాన్ భారతీయ చిత్ర పరిశ్రమకు గొప్ప నటుడిని అందించిన తల్లి. తాను సినిమా నటి కాకపోయినా? జీనత్ ఖాన్ కడుపున బిడ్డ నేడు బాలీవుడ్ లోనే లెజెండ్ గా ఎదిగారు.
By: Tupaki Desk | 8 Jun 2025 7:00 AM ISTజీనత్ ఖాన్ భారతీయ చిత్ర పరిశ్రమకు గొప్ప నటుడిని అందించిన తల్లి. తాను సినిమా నటి కాకపోయినా? జీనత్ ఖాన్ కడుపున బిడ్డ నేడు బాలీవుడ్ లోనే లెజెండ్ గా ఎదిగారు. అతనే అమీర్ ఖాన్. మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన హీరోగా 'సితారే జమీన్ ఫర్' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2007లో రిలీజ్ అయిన 'తారే జమీన్ పర్' చిత్రానికి సీక్వెల్ ఇది.
ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. సినిమా ప్రచారం పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ఊహించని వార్త ఒకటి చెప్పారు. ఈ సినిమాలో 90 ఏళ్ల తన తల్లి జీనత్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సంగతి ఆయన మాటల్లో నే... అమ్మకు సినిమాలంటే ఇష్టముండదు. చాలా సార్లు సినిమా సెట్స్ కు పిలిచినా వచ్చేది కాదు.
కానీ ఓ రోజు సడెన్ గా నా సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందని ఆరా తీసింది. అది విని ఆశ్చర్య పోయాను. తనకు సినిమా సెట్స్ కు రావాలని ఉందని అంది. అనంతరం నా సొదరి అమ్మను ఆన్ లోకేషన కు తీసుకొచ్చింది. ఆ రోజు పెళ్లి సెలబ్రేషన్ పాట షూట్ చేస్తున్నాం. దర్శకుడు ఆర్. ఎస్ ప్రసన్నకు అప్పుడే ఓ ఐడియా వచ్చింది. అమ్మను కూడా పాటలో చూపిస్తే ఎలా ఉంటుందన్నారు.
దానికి అమ్మ ఒప్పుకుంటుందా? అని సందేహ పడ్డాను. ధైర్యం చేసి అడిగాను. అందుకు అమ్మ వెంటనే ఒప్పుకుంది. మరో మాట మాట్లాడలేదు. సినిమాలంటే పడని అమ్మ పాటలో కనిపించడం చాలా సంతో షంగా ఉంది. కొన్ని షాట్స్ లో కూడా కనిపిస్తుంది. తను నటించిన సినిమా ఇదే తొలి కాబట్టి నా కెప్పుడు ఓ జ్ఞాపకంలా ఈ చిత్రం మిగిలిపోతుందని అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేసారు.
