అమీర్‌ఖాన్‌కు అర్జునుడు దొరికేశాడా?
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కెరీర్ గత కొంత కాలంగా డల్‌గా సాగుతోంది. వరుస విజయాల్ని, బ్లాక్ బస్టర్లని దక్కించుకున్న అమీర్‌ఖాన్ ఇప్పుడు వరుస ఫ్లాపులని ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 5:52 AMబాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కెరీర్ గత కొంత కాలంగా డల్‌గా సాగుతోంది. వరుస విజయాల్ని, బ్లాక్ బస్టర్లని దక్కించుకున్న అమీర్‌ఖాన్ ఇప్పుడు వరుస ఫ్లాపులని ఎదుర్కొంటున్నారు. కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ రేసులో కాస్త వెనుకబడ్డారు. ప్రస్తుతం సితారే జమీన్‌పర్, లాహోర్ 1947 సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలనీ అమీర్‌ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `కూలీ` మూవీలో కీలక అతిథి పాత్రలో అమీర్‌ఖాన్ కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే అమీర్‌ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ `మహాభారతం`ని ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, తనకున్న అతిపెద్ద ఆశయాల్లో `మహాభారతం` ఒకటని, ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలనుకుంటున్నానని, దీని రైటింగ్‌కు కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఒకే సినిమాలో దీన్ని చూపలేనని అందేకే దీన్ని పలు సిరీస్‌లుగా రూపొందించాలనుకుంటున్నానని అమీర్‌ఖాన్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే.
ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ కోసం రాజమౌళి ఫాదర్, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ని కూడా ఒకసారి సంప్రదించిన అమీర్ ప్రస్తుతం మహాభారతంలోని కీలక పాత్రల కోసం క్రేజీ నటులను, హీరోలను ఎంపిక చేసే పనిలో పడ్డారట. ఓ పక్క స్క్రిప్ట్ పనులు జరుగుతుండగానే కీలక పాత్రలకు సంబంధించిన నటీనలును ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట. శ్రీకృష్ణుడు క్యారెక్టర్‌ని తానే చేస్తానని ముందుగానే రిజర్వ్ చేసుకున్న అమీర్‌ఖాన్ ఇతర పాత్రలకు క్రేజీ హీరోలని సంప్రదిస్తున్నారట.
ఇందులో భాగంగానే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ఇటీవల అమీర్‌ఖాన్ కలిశారని, అట్లీ మూవీ గురించి ముంబైకి వెళ్లిన సమయంలో బన్నీని కలిసిన అమీర్‌ఖాన్ చర్చలు జరిపారని, అర్జునుడి క్యారెక్టర్ చేయాలని అడిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కూడా ఆ క్యారెక్టర్‌లో నటించడానికి ఆసక్తిని చూపించాడని, త్వరలోనే దీనిపై అమీర్‌ఖాన్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల టాక్. మహాభారతంని 5 లేదా 6 భాగాలుగా తెరపైకి తీసుకురావాలని అమీర్‌ఖాన్ ప్లాన్ చేస్తున్నాడట.