అలా చనిపోవాలనుకుంటున్నా..
లాల్ సింగ్ చద్దా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అమీర్ ఖాన్ తిరిగి ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడు. అమీర్ ఖాన్ నటించిన తాజా సినిమా సితారే జమీన్ పర్ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 1:00 AM ISTలాల్ సింగ్ చద్దా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అమీర్ ఖాన్ తిరిగి ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడు. అమీర్ ఖాన్ నటించిన తాజా సినిమా సితారే జమీన్ పర్ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు అమీర్.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ తన తర్వాతి సినిమా పనుల్ని వేగవంతం చేశాడు. అమీర్ నెక్ట్స్ చేయబోయే సినిమా, తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన ఆఖరి సినిమా గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా మహాభారతం తన ఆఖరి సినిమా అవుతుందేమో అని కూడా ఆయన అన్నాడు.
ఇంటర్వ్యూలో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, మహాభారతం సినిమా తీయాలనేది తన డ్రీమ్ అని, సితారే జమీన్ పర్ రిలీజయ్యాక ఆ సినిమాపైనే తాను ఫుల్ ఫోకస్ ను పెట్టనున్నట్టు చెప్పాడు. మహాభారతమనేది చాలా పెద్ద ప్రాజెక్టు అని, ఆ సినిమా చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదని అనిపించొచ్చని దానికి కారణం మహాభారతంలో ఎంతో గొప్ప విషయముండటమేనని అన్నాడు.
మహాభారతం గొప్ప ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అందులో చాలా ఎమోషన్ కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో కనిపిస్తుందని అన్నాడు. ఎవరైనా మీ లాస్ట్ మినిట్ ఎలా ఉండాలని కోరుకుంటారని అడిగితే, దానికి తాను పని చేస్తూ చనిపోవాలనుకుంటున్నానని చెప్తానన్నాడు. మనమంతా ఇలానే కోరుకుంటామని, అందుకే మహాభారతం చేశాక ఇక తానేమీ చేయనవసరం లేదనే ఎమోషన్ ను పొందాలనుకుంటున్నట్టు అమీర్ ఖాన్ తెలిపాడు. ఎన్నో ఏళ్లుగా మహభారతం కథతో జర్నీ చేస్తున్నానని, వెండితెరపై దాన్ని గొప్పగా చూపించాలని కలలు కంటున్నానని, ఈ సినిమా తర్వాత నటుడిగా చేయడానికి ఇంకేమీ లేదనే భావన కలుగుతుందని అన్నాడు. అయితే ఈ కామెంట్స్ ను విన్న అమీర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఇక సినిమాలు చేయడా అని దిగులు పడుతున్నారు.
