మహాభారత్ వర్సెస్ మహాభారత్ తప్పదా?
అయితే జక్కన్న తరహాలోనే `మహాభారత్` తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ప్రకటించడం సరికొత్త చర్చకు తెరలేపింది.
By: Tupaki Desk | 2 May 2025 2:30 AMమన ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే `మహాభారత్` ఇప్పటికీ ప్రత్యేకమే. దీన్ని మారుతున్న టెక్నాలజీని జోడించి హాలీవుడ్ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కథతో ఓ భారీ కాన్వాస్‌పై సినిమా చేయాలని ఉందని, దీంతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలని యావత్ ప్రపంచాపికి తెలియజెప్పాలని ఉందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. అయితే దానికి ఇంకా సమయం ఉందని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా వెల్లడించారు.
అయితే జక్కన్న తరహాలోనే `మహాభారత్` తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ప్రకటించడం సరికొత్త చర్చకు తెరలేపింది. ఇటీవల ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ మహాభారత్` ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మహాభారత్`ను రూపొందించడం తన కళ అన్నారు. అంతే కాకుండా తనకున్న అతిపెద్ద ఆశయాల్లో ఇది కూడా ఒకటన్నారు. భారతీయ ఇతిహాసానికి ప్రాణం పోయాలన్నది తన కల అన్నారు.
ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలనుకుంటున్నాను. దీని రైటింగ్‌కు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో మొత్తం కథని చూపించలేం. అందుకే దీన్ని సిరీస్‌లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నాను. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇండస్ట్రీలోనిఎంతో మంది దర్శకులు దీని కోసం పనిచేయనున్నారు. స్టోరీ రాసుకున్న తరువాత పాత్రలకు ఏ నటీనటులు సరిపోతారో చూసుకుని ఎంపిక చేస్తాం. నేను నటిస్తానా? లేదా అనేది తరువాత ఆలోచిస్తాను` అన్నారు.
దాదాపు రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమీర్ `మహాభారత్`కు టైమ్ పట్టేలా కనిపిస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కోసమే సంవత్సారాలు సమయం తీసుకోబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. పురాణాలని తిరగేసి ఆ తరువాతే కథని సిద్ధం చేస్తారట. అయితే అమీర్ ఖాన్ `మహాభారత్` యావత్ ఇండియన్స్ ని ఆకట్టుకునే స్థాయిలో ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. రాజమౌళి అయితే బాగుంటుందని, బాలీవుడ్ వాళ్లకు పురాణాలని తెరకెక్కించడంలో అంత పట్టుఉండదని ఇటీవల వచ్చిన `ఆదిపురుష్`తో తేలిపోయిందని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా అంతా రీసెర్చ్ చేసి అమీర్‌ఖాన్ `మహాభారత్`ను మొదలు పెట్టే సమయానికిరాజమౌళి కూడా మొదలు పెట్టేస్తాడని, అప్పుడు రెండు మహాభారత్‌ల మధ్య పోటీ అనివార్యం అని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాకుండా ఇటవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ని స్క్రీన్‌ప్లే కోసం అమీర్ ఖాన్ కలిశారట. తరువాత ఎందుకో అంతగా ఆసక్తిని చూపించలేదట. దాంతో తను కూడా ఆసక్తి చూపించలేదని తెలిపారు. అయితే రాజమౌళి కూడా మహాభారత్ చేయాలనే ఆలోచనలో ఉన్నందునే అమీర్ మరోసారి విజయేంద్ర ప్రసాద్‌ని కలవడానికి ఇష్టపడలేదని ఇన్ సైడ్ టాక్. అమీర్ తను రూపొందించనున్న `మహాభారత్`లో తనే కృష్ణుడిగా నటించనున్నాడట, అయితే జక్కన్న మహాభారత్‌లో మాత్రం అదే పాత్రని మహేష్ బాబుతో చేయించాలనుకుంటున్నారట.