2026 లో అమీర్-లోకేష్ పిక్సైపోయారు!
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా లోకేష్ తో అమీర్ సినిమా చేయబో తున్నా రు? అన్న ప్రచారం కూడా మొదలైంది. కొత్త దర్శకులతో అమీర్ లాంటి పేరున్న నటుడు రంగంలోకి దిగితే ఇలాంటి ప్రచారం సహ జమే.
By: Tupaki Desk | 11 Jun 2025 5:00 PM ISTబాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రతిభావంతులైన దర్శకుల్ని వెతికి పట్టుకోవడంలో గొప్ప మేధావి. తన అనుభవాన్ని రంగరించి ఇండస్ట్రీలో ఎవరు పనివంతులో గమనించి వాళ్లతో పచేస్తుంటారు. అమీర్ సొంత నిర్మాణ సంస్థలో బయట హీరోలతో నిర్మించడం గానీ...తానే రంగంలోకి దిగడంగానీ చేస్తుంటారు. ప్రస్తు తం అమీర్ ఖాన్ ...సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న `కూలీ`లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా లోకేష్ తో అమీర్ సినిమా చేయబో తున్నా రు? అన్న ప్రచారం కూడా మొదలైంది. కొత్త దర్శకులతో అమీర్ లాంటి పేరున్న నటుడు రంగంలోకి దిగితే ఇలాంటి ప్రచారం సహ జమే. కానీ ఈ ప్రచారం నిజమవుతుంది. లోకేష్ తో సినిమా చేయడానికి అమీర్ ఖాన్ సిద్దంగా ఉన్నారని కాలక్రమంలో అర్దమైంది. అయినా లోకేష్ బిజీ దర్శకుడు. చేతిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు చాలా ఉన్నాయి.
అవన్నీ పూర్తయిన తర్వాతే అమీర్ సినిమా గురించి కూల్ గా ఆలోచన చేసే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ అమీర్ ఖాన్ అంత సమయం తీసుకోవడం లేదు. ఉన్న పళంగా ఇద్దరు కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే సందేహాన్ని ఓ బాలీవుడ్ మీడియా జర్నలిస్ట్ అమీర్ ఖాన్ ముందుకు తీసుకెళ్లగా... అమీర్ సంతోషంగా అంగీకరించారు. ఆ ప్రచారాన్ని అమీర్ ఖాన్ ధృవీకరించారు.
ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను వేర్వేరు కమిట్ మెంట్లతో ఉన్నానని అవన్నీ ఇదే ఏడాది ముగించుకుని వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ కు సిద్దంగా ఉంటా న్నారు. దీంతో ప్రాజెక్ట్ కన్పమ్ అయింది. ఈ లోగా లోకేష్ కనగరాజ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లున్నాయి. కార్తీ తో `ఖైదీ 2 `ముగించాలి. ఆ తర్వాత సూర్యతో `రోలెక్స్` సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి టైమ్ ఎక్కువ పడుతుందంటే? అమీర్ సినిమా కోసం పనిచేయడం మొదలు పెడతారు.