ఫాల్కే రోల్ అమీర్ ఖాన్ కెరీర్ కే బిగ్ ఛాలెంజ్!
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ఎంత గొప్ప నటుడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 20 May 2025 9:30 PMబాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ఎంత గొప్ప నటుడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆయన సూపర్ స్టార్ అయ్యాడంటే? కేవలం అతడు పోషించిన పాత్రల ద్వారానే. బాలీవుడ్ లో ఎంత మంది స్టార్లున్నా? అమీర్ ఖాన్ మాత్రం బాలీవుడ్ కే ప్రత్యేకం. కెరీర్ లో ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించారు. మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసారు. ప్రయోగాలకు పెట్టింది పేరుగా? అమీర్ కు పేరుంది.
ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పనిచేసే నటు డీయన. అమితాబచ్చన్ తర్వాత ఆయన స్థానాన్ని అందుకునే నటుడిగా అమీర్ ఖ్యాతికెక్కారు. అలాంటి నటుడకి తొలిసారి ఫాల్కే రూపంలో బిగ్ ఛాలెంజ్ ఎదురు కాబోతుంది. ఇంత వరకూ అమీర్ పోషించిన పాత్రలు ఒక ఎత్తైతే . ఫాల్కే జీవితం లో పరకాయ ప్రవేశం చేయడం మరో ఎత్తు.
భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే దర్శక, నిర్మాతగా, రైటర్ గా, ఎడిటర్ గా , కాస్ట్యూమ్ డిజైనర్ గా, మ్యాకప్ ఆర్టిస్గ్ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలందించారు. సినిమా రంగంలో అసామాన్యుడిగా ఎదిగారు. ఇదంతా కేవలం ఆయన ప్రతిభ, తెలివితేటలతోనే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు..రివార్డులు ఆయన సొంతం. అలాంటి అనన్య సామాన్యుడి పాత్ర పోషించడం ఏ నటుడుకైనా సవాలే.
ఈ నేపథ్యంలో అమీర్ ఫాల్కేలా సన్నధం అవ్వడం కోసం శరీరాకృతిలోనూ ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఫాల్కే మాండలికంపై కూడా ట్రైనింగ్ మొదలు పెట్టారు. ఫాల్కే అప్పటి ఆహార్యంలో ఎలా ఉండే వారు? 1900 కాలంలో ఆయన వస్త్రాధరణ ఎలా ఉండేది? ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఏఐ ఖచ్చి తత్వంతో లాస్ ఎంజెల్స్ స్టూడియోస్ లో పున సృష్టస్తున్నట్లు సమాచారం. ప్రేక్షకుల్ని 1900 నాటి కాలం రోజుల్లోకి తీసుకెళ్లాలి. అంటే అలాంటి సెట్లు.. వాతా వరణం పున సృష్టించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే నిర్మాణం కోసం రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. 2027లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.