కూతురు వయసున్న నటితో 60 ఏజ్ హీరో?
ఆ ఇద్దరూ పెళ్లయిన జంటగా నటించారు. తనకంటే చాలా చిన్నమ్మాయి భార్యగానా? ఈ నిర్ణయాన్ని అమీర్ చిరునవ్వుతో అంగీకరించాడు.
By: Tupaki Desk | 10 Jun 2025 6:00 AM IST60 వయసులోను చాలా యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ఇటీవలే మూడో భార్య గురించి పరిచయం చేసాడు. అతడు ఇంకా నటనకు కానీ, రొమాన్స్ కి కానీ రిటైర్ మెంట్ ప్రకటించలేదు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ లో 80 ఏళ్ల నటుడిని 40లో ఉన్నట్టు చూపించగలం.. కాబట్టి టెన్షన్ లేదు! అని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఊహించని విధంగా అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం 'సీతారే జమీన్ పర్'లో తన కంటే వయసులో చాలా చిన్న నటి అయిన జెనీలియా డిసౌజా భర్తగా కనిపించనున్నారు. చాలా మందికి ఈ జంట అసాధారణంగా అనిపిస్తుంది. వయో భేధం ప్రజలు గమనించడం కష్టమేమీ కాదు.
అయితే అమీర్ ని నెటిజనులు తప్పు పట్టడానికి కారణాలు లేకపోలేదు. 2008లో తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ సరసన 'జానే తు... యా జానే నా' అనే ప్రేమకథలో జెనీలియాను హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది అమీర్ ఖాన్. అలాంటిది అదే కథానాయికకు భర్తగా నటిస్తున్నాడు. పదిహేనేళ్ల తర్వాత ఇది సాధ్యమైంది.
ఆ ఇద్దరూ పెళ్లయిన జంటగా నటించారు. తనకంటే చాలా చిన్నమ్మాయి భార్యగానా? ఈ నిర్ణయాన్ని అమీర్ చిరునవ్వుతో అంగీకరించాడు. అవును నాకు తెలుసు.. ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది! అని చెబుతూనే, అది చాలా కాలం క్రితం జరిగింది కదా! అంటూ నవ్వేసాడు. 60 ఏళ్ల వయసున్న అమీర్.. 40లో ఉన్న జెనీలియా కూడా ఇప్పుడు 40లలో ఉన్న కపుల్ గా నటించారు. అయితే వీఎఫ్ ఎక్స్ లో ప్రతిదీ మారుతుందని అమీర్ ఖాన్ భరోసానిచ్చాడు. శుభ్ మంగళ్ సావధాన్ ఫేం ఆర్.ఎస్ ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సితారే జమీన్ పర్ - కొందరు మానసిక వైకల్యం ఉన్న కుర్రాళ్ల కథ. ఇందులో అమీర్ పాత్ర ఏమిటన్నది వేచి చూడాలి.