Begin typing your search above and press return to search.

వీఎఫ్‌ఎక్స్‌తో సూపర్‌ స్టార్‌ వయసు తగ్గించారా?

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ దశాబ్ద కాలంగా సక్సెస్‌ కోసం కుస్తీలు పడుతున్నాడు. దంగల్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన హిట్‌ కొట్టలేక పోయాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 3:00 PM IST
వీఎఫ్‌ఎక్స్‌తో సూపర్‌ స్టార్‌ వయసు తగ్గించారా?
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ దశాబ్ద కాలంగా సక్సెస్‌ కోసం కుస్తీలు పడుతున్నాడు. దంగల్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన హిట్‌ కొట్టలేక పోయాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. దాంతో సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. లాల్‌ సింగ్‌ చద్దా తర్వాత ఎట్టకేలకు సితారే జమీన్‌ పర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈనెలలో రాబోతున్న సితారే జమీన్‌ పర్‌ సినిమాపై అంచనాలు పెట్టుకున్న ఆమీర్‌ ఖాన్‌.. ఆ సినిమాను ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. గత నెల రోజులుగా ఆయన సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన ఏజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'సితారే జమీన్‌ పర్‌' సినిమాలో ఆమీర్‌ ఖాన్‌కి జోడీగా జెనీలియా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో వీరిద్దరు కలిసి నటించడం పట్ల చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది. ఇద్దరు ఎలా కలిసి నటించారు అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఆమీర్‌ ఖాన్‌ వయసు 60 కాగా, జెనీలియా వయసు 37 ఏళ్లు అనే విషయం తెల్సిందే. వయసు తేడా గురించి ఆమీర్‌ ఖాన్‌ స్పందించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... మా ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉందని నాకు తెలుసు. అయితే మేము ఇద్దరం కూడా నాలుగు పదుల వయసు పాత్రల్లో కనిపించబోతున్నాము. ఆమె కూడా నాలుగు పదుల వయసులో కనిపించనున్న నేపథ్యంలో సినిమా లో మా ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కనిపించదు అన్నాడు.

అంతే కాకుండా ఆయన నా వయసు 60 అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించి తన వయసును తగ్గించారు అన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోల వయసు తగ్గించడం కోసం, హీరోయిన్స్‌ను మరింత అందంగా, నాజూకుగా చూపించడం కోసం విచ్చలవిడిగా వీఎఫ్‌ఎక్స్ ను వినియోగిస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోలను చూపించే తీరుకు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్‌ సాధారణంగా ఈయన చాలా సన్నగా ఉంటాడు, ఇందులో ఏంటి ఇలా ఉన్నాడు అనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకుంటున్న మేకర్స్‌ హీరోల లుక్‌ను మార్చేస్తున్నారు అంటూ చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆమీర్ ఖాన్‌ ఆ విషయం నిజమే అంటూ చెప్పకనే చెప్పాడు. వయసు ఎక్కువ అయినా కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో వయసు తగ్గించారు అంటూ ఆమీర్‌ ఖాన్‌ చెప్పడం చూస్తూ ఉంటే ఇంకా చాలా మంది హీరోలకు ఈ వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీని వినియోగిస్తూ ఉంటారు అనే చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఆమీర్‌ ఖాన్‌ వివరణ తర్వాత మరింతగా ట్రోల్స్ వస్తున్నాయి. వయసు తేడాను కవర్‌ చేయడంకు వీఎఫ్‌ఎక్స్‌ను వినియోగిస్తున్నారా అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. మరి సినిమాలో ఆమీర్‌, జెనీలియా ఎలా కనిపిస్తారు అనేది చూడాలి.