డ్రీమ్11 యాడ్.. అమీర్ ఖాన్ చీప్ రెస్పాన్స్!
కానీ ఇంకొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ను హీరోలు, క్రికెటర్లు ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ యాక్ట్ చేయడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
By: Tupaki Desk | 13 Jun 2025 1:00 PM ISTక్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 గురించి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రణబీర్ కపూర్, అమీర్ ఖాన్.. టీమ్ ఇండియా ప్లేయర్స్ కలిసి చేసిన డ్రీమ్ 11 యాడ్ చేయగా.. అది కొంతకాలం పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు బాగా నటించారని కొనియాడారు.
యాడ్ లో ఆ స్టార్ హీరోలకు దీటుగా క్రికెటర్లు కూడా నటించడం ఆశ్చర్యానికి గురి చేసిందని అభిమానులు అన్నారు. కానీ ఇంకొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ను హీరోలు, క్రికెటర్లు ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ యాక్ట్ చేయడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఎందుకంటే.. తాను ఎప్పుడూ వైన్, టొబాకోను ప్రోత్సహించనని అమీర్ ఖాన్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు డ్రీమ్ 11 యాడ్ లో నటించారు. అంతే కాదు యాడ్ విషయంలో రీసెంట్ గా ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా చీప్ గా ఉన్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
డ్రీమ్ 11 యాడ్ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని అమీర్ ఖాన్ తెలిపారు. దానిని చదివిన తర్వాత తాను నవ్వు ఆపుకోలేకపోయానని చెప్పారు. స్క్రిప్ట్ కారణంగానే తాను దానిని మిస్ కాలేకపోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం యాడ్ విషయంలో అమీర్ ఖాన్ చెప్పిన చీప్ రీజన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
అమీర్ ఖాన్ చెప్పిన రీజన్ అసలు కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదేం సినిమా కాదు కదా అని అంటున్నారు. భారీ ప్రాజెక్ట్ అన్నట్లు చెప్పారని ఎద్దేవా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసి.. మళ్లీ చీప్ రీజన్ చెప్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, అమీర్ ఖాన్ తాను నటించిన సినిమాలు ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు యాడ్స్ వైపు వెళ్లారని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇదేం కొత్త కాదని.. ఇప్పటికే ఆయన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారని చెబుతున్నారు. రేట్ చెప్పకుండా అన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారని కామెంట్లు పెడుతున్నారు. డబ్బుల కోసమే అలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అమీర్ యాడ్ విషయం హాట్ టాపిక్ గా మారింది.
