జీవితాంతం రీమేక్‌లే చేస్తా.. స్టార్ హీరో ఫైరింగ్
స్టార్ హీరో ఫైరయ్యాడు. ``రీమేక్ లతో పరిశ్రమ నష్టపోతున్నా ఒరిజినల్ కథలతో సినిమాలు ఎందుకు చేయడం లేదు?`` అని ప్రశ్నించిన మీడియా వ్యక్తులపై చాలా సీరియస్ అయ్యాడు.
By: Tupaki Desk | 22 Jun 2025 8:15 AM ISTస్టార్ హీరో ఫైరయ్యాడు. ``రీమేక్ లతో పరిశ్రమ నష్టపోతున్నా ఒరిజినల్ కథలతో సినిమాలు ఎందుకు చేయడం లేదు?`` అని ప్రశ్నించిన మీడియా వ్యక్తులపై చాలా సీరియస్ అయ్యాడు. అంతేకాదు తాను జీవితాంతం రీమేక్ లే చేస్తానని అన్నాడు. తన కెరీర్ లో రీమేక్‌లతోనే ఒరిజినల్ సినిమాలు సాధించిన దాని కంటే ఎక్కువ సాధించానని అన్నాడు. అలాగే రీమేక్ పేరుతో తాను ఎప్పుడూ కట్ పేస్ట్ చేయలేదని కూడా వాదించాడు. మొత్తానికి మీడియా అతడు చేసిన సౌండ్ కి బెదిరింది.
ఆ హీరో మరెవరో కాదు.. ది గ్రేట్ అమీర్ ఖాన్. ఇటీవల బాలీవుడ్ వరుసగా రీమేక్ లు చేస్తూ ఫ్లాపుల్ని ఎదుర్కొంటోందని ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ లో వెనకబడిందని విమర్శలు వస్తున్న వేళ అమీర్ ఖాన్ నుంచి ఈ స్పందన ఊహించనిది. అతడు నేరుగా రీమేక్ లను తప్పు పట్టడం సరికాదని అన్నాడు. సీతారే జమీన్ పార్ స్పానిష్ సినిమా కాంపియోన్స్ కి రీమేక్. అయినా ఒరిజినల్ స్పానిష్ సినిమా ఎంతమంది చూశారు? అని కూడా అమీర్ ప్రశ్నించాడు. తాను ఆ సినిమాని యథాతథంగా కాపీ పేస్ట్ చేయలేదని అన్నాడు.
తన కెరీర్ లో రీమేక్ సినిమా అయిన `గజినీ`తో తాను సాధించిన దానిని కూడా అమీర్ గుర్తు చేసుకున్నాడు. నిజానికి అమీర్ ఖాన్ కి గజిని తొలి రూ.100 కోట్ల క్లబ్ సినిమా. అంతేకాదు... బాలీవుడ్ కి కూడా తొలి 100 కోట్ల క్లబ్ సినిమా ఇది. దశాబ్ధాల క్రితమే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గజినీ హిందీ రీమేక్ ని నిర్మించినందుకు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అమీర్ లాంటి స్టార్ కి గొప్ప విజయాన్ని ఇచ్చిన నిర్మాతగా పాపులరయ్యారు.
భారతీయుల అభిరుచికి తగ్గట్టే తాను సీతారే జమీన్ పర్ కోసం స్పానిష్ కథను మార్చానని కూడా అమీర్ అన్నారు. సీతారే జమీన్ పర్ కి పాజిటివ్ సమీక్షలే వచ్చాయి. కానీ ఓపెనింగులు రాబట్టడంలో తడబడింది. ఈ చిత్రంలో జెనీలియా కీలక పాత్రను పోషించింది. కాజోల్ `మా` కూడా సీతారే జమీన్ పర్ తో పోటీపడి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ హారర్ సినిమా కూడా భారీ అంచనాలతో విడుదలైంది.
