ప్రపంచంలో దేనికి పనికిరానిదానిలా!
తాజాగా ఓపాడ్ కాస్ట్ లో ఐరాఖాన్ 25 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల సంపాదన మీదనే ఆధారపడి బ్రతుకుతున్నట్లు తెలిపింది.
By: Tupaki Desk | 23 July 2025 9:00 AM ISTబాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కూతురంటే అమీర్ కు ఎంతో ఇష్టం. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా? తానెంత బిజీగా ఉన్నా కుమార్తె తో తను అనుభ వాలను పంచుకుంటూనే ఉంటారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నా ఓతండ్రిగా అమీర్ఖాన్ మాత్రం తన ప్రేమను ఎంత మాత్రం కుమార్తెకు దూరం చేయలేదు. మాజీ భార్యతో అప్పుడప్పుడు కలవడం కుమార్తెను సంతోష పెట్టడం జరుగుతుంది. అయితే ఐరాఖాన్ మాత్రం తనని తాను ఎంతో తక్కువ చేసుకుని మాట్లాడం ఆసక్తికరం.
తాజాగా ఓపాడ్ కాస్ట్ లో ఐరాఖాన్ 25 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల సంపాదన మీదనే ఆధారపడి బ్రతుకుతున్నట్లు తెలిపింది. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ తాను రూపాయి సంపాదించలేదని వాపోయింది. ఇలాగే కొనసాగితే ప్రపంచంలో ఇంకే పనికి పనికి రానేమో అన్న భావన కలుగుతుందని భావోద్వేగానికి గురైంది. `అందరూ ఏదో పనిచేస్తున్నారు. నేను మాత్రం ఉన్న డబ్బునే ఖర్చు చేస్తున్నానంది. అయితే ఈ వ్యాఖ్యల్ని అమీర్ ఖాన్ ఖండించారు. `ఐరా ఖాన్ చిన్న వయసులోనే ఎంతో మందికి సహాయం చేసింది.
ఎంతో గొప్ప హృదయం గలది. సహాయం కావాలంటే తనే ముందుంటుంది. తన దగ్గర ఏది ఉంటే అది సహాయం చేస్తుంది. తనలో ఆ గుణం చిన్ననాటి నుంచే అలవాటు అయింది. సంపాదన కన్నా సేవ అన్నది ఎంతో గొప్పది. డబ్బులన్నా అందరూ దానాలు చేయలేరు. అది కొంత మందే చేయగలరు. అలా నా కూతురు చేయగ ల్గుతుంది.అందుకు ఓ తండ్రిగా నేనెంతో గర్వపడుతున్నాను అని అమీర్ తెలిపారు.
ఐరాఖాన్ సొంతంగా అగస్త్య పౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. మానసిక రుగ్మతలకు గురైన వారిని అక్కున చేర్చుకుని వారి పట్ల ఎంతో దయాగుణంతో పని చేస్తుంది. సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే సినిమాల్లోకి రావాలని ఎదురు చూస్తుంటారు. కానీ ఐరాఖాన్ ప్రయాణం మాత్రం అందుకు భిన్నం. ఎంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సేవా కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొంటుంది.
