స్టార్ హీరో ముగ్గురు పిల్లలకు ముస్లిమ్ పేర్లు ఎందుకు?
అమీర్ ఖాన్ ముగ్గురు భార్యలు హిందువులు. కానీ అతడి ముగ్గురు పిల్లల పేర్లు ముస్లిమ్ పేర్లు అనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 21 Jun 2025 10:00 PM ISTరొటీన్ కి భిన్నంగా ఆలోచించే నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ మూడు పెళ్లిళ్ల గురించి చాలా చర్చ సాగింది. అతడు హిందూ యువతులను పెళ్లాడాడు. కానీ పిల్లలకు ముస్లిమ్ పేర్లను పెట్టుకున్నాడని అపవాదు ఉంది. నిజంగానే అమీర్ ఖాన్ మత చాందసుడా? తాను ముస్లిమ్ కాబట్టి పిల్లలకు ముస్లిముల పేర్లను ఎంచుకున్నాడా? అంటే.. ఈ ప్రశ్నకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ఆప్ కి అదాలత్‌లో హోస్ట్ రజత్ శర్మతో ఇంటర్వ్యూలో అమీర్ కి ఈ ప్రశ్న ఎదురైంది. అమీర్ తన పిల్లలకు జునైద్, ఇరా, ఆజాద్ అని ఎందుకు పేర్లు పెట్టుకున్నారు?
అమీర్ ఖాన్ ముగ్గురు భార్యలు హిందువులు. కానీ అతడి ముగ్గురు పిల్లల పేర్లు ముస్లిమ్ పేర్లు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో అమీర్ ఖాన్ స్పందిస్తూ.. తన పిల్లల పేర్లను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు. అలాగే తన పిల్లల పేర్లను ఎంపిక చేయడంలో తన ప్రమేయం ఏదీ లేదని, అంతా తన భార్యలే చూసుకున్నారని అమీర్ తెలిపారు.
మొదటి భార్య రీనా తన ఇద్దరు పిల్లల పేర్లను ఎంపిక చేసుకున్నారు. జునైద్, ఇరా ఖాన్ తన పిల్లల పేర్లు. ఇరా అంటే సరస్వతి అని అర్థం. ఇరావతి అనే పేరు పురాణాలలో ఉంది. భారతీయ సంస్కృతి పురాణేతిహాసాలతో సంబంధం కలిగిన పేరు ఇది. ఇరా అంటే సరస్వతి.. అని అమీర్ ఖాన్ తెలిపారు. దీనిని మేనకా గాంధీ హిందూ పేర్ల పుస్తకం నుంచి రీనా ఎంపిక చేసుకున్నారని తెలిపారు. రెండో భార్య కిరణ్ రావు తన కుమారుడికి అజాద్ రావు అని పేరు పెట్టుకోవడానికి కారణం.. అజాద్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఎంపిక చేసుకున్న హిందూ హిందువు. మౌలానా అబుల్ కలామ్ అజాద్ పేరు నుంచి ఇది తీసుకున్నాం. ఆయన స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన యోధుడు. నెహ్రూ, గాంధీ, సర్ధార్ పటేల్ వంటి వారితో కలిసి పోరాడారు. ఆయన పేరు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.
అమీర్ ఖాన్ రీనా దత్తాను పెళ్లాడి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ లకు తండ్రి అయ్యారు. తర్వాత ఈ జంట విడిపోయారు. అటుపై తన సహాయ దర్శకురాలు కిరణ్ రావును అమీర్ ఖాన్ పెళ్లాడాడు. అజాద్ రావు అనే కుమారుడు వారికి ఉన్నారు. ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అనే మరో హిందూ వితంతువుతో అమీర్ ఖాన్ సంబంధంలో ఉన్నాడు.
