తాగను తాగను అంటూనే ఫ్లూటుగా తాగిన స్టార్!
తాగాక కూడా పార్టీలో అందరితో మాట్లాడాడు. దగ్గాడు తుమ్మాడు. కానీ మరుసటి రోజు ఉదయం లేవగానే అవేవీ గుర్తు లేవు.
By: Tupaki Desk | 14 Jun 2025 7:16 PM ISTసాయంత్రం 7 కి మొదలు పెట్టి 9వరకూ తాగుతూనే ఉన్నాడట ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. అసలు తాగకూడదు అని అనుకున్నా, చాలా గ్యాప్ రావడం వల్ల త్వరగా ఆల్కహాల్ కు ఆకర్షితుడయ్యానని ఒప్పుకున్నాడు. నేను ఇకపై తాగను అంటూనే ఫ్లూటుగా తాగాడట.
తాగాక కూడా పార్టీలో అందరితో మాట్లాడాడు. దగ్గాడు తుమ్మాడు. కానీ మరుసటి రోజు ఉదయం లేవగానే అవేవీ గుర్తు లేవు. అతడు పార్టీలో ఆల్కహాల్ తీసుకోవడానికి కారణం సన్నిహితులు, స్నేహితులు అందరూ ఆనందంగా ఉండాలని. తన 60వ బర్త్ డే పార్టీలో వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ మరుసటి రోజు అసలు పరిస్థితి వేరుగా ఉంది. ఆనందం స్థానంలో దుఃఖం మిగిలింది. మెమరీస్ ఏవీ లేక విలవిలలాడాటట.
నేను సాధారణంగా ఇకపై తాగను అనుకుంటాను కానీ ఆ రోజు నేను, ''ఎందుకు తాగకూడదు?'' అని అనుకున్నాను. నేను తీవ్రంగా ఉండే వ్యక్తిని.. కొంతకాలంగా తాగడం లేదు కాబట్టి ఆల్కహాల్ నన్ను త్వరగా ప్రభావితం చేసింది. మేము రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రారంభించాము .. 9 గంటల వరకూ సందడి చేస్తూనే ఉన్నాను. తాగినా సాధారణంగానే ప్రవర్తించాను. ఎదుటివారి మాటలకు స్పందించాను. కానీ మరుసటి రోజు నిదుర లేవగానే నా జ్ఞాపకాల్లో ఏదీ మిగలలేదు. పరిస్థితి భయానకంగా మారింది... అని తెలిపాడు. అమీర్ నటించిన సితారే జమీన్ పర్ 20, జూన్ 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.