Begin typing your search above and press return to search.

'మ‌హాభారతం' మొద‌లైపోయిందా అమీర్ జీ!

ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి కంటే ముందుగానే అమీర్ ఖాన్ 'మ‌హాభారతాన్ని' ప‌ట్టాలెక్కించేలా క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2025 1:30 PM
Aamir Khan Mahabharat Project
X

'మ‌హాభారతం' త‌మ‌ డ్రీమ్ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్...టాలీవుడ్ సంచ‌ల‌నం రాజ‌మౌళి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌నొచ్చి కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తుంది. కానీ ఇంత వ‌ర‌కూ ఏ ఒక్క‌రు దీని గురించి సీరియ‌స్ గా ఆలోచించ‌లేదు. అయితే రాజ‌మౌళి కంటే ముందులో అమీర్ ఖాన్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపిస్తున్నారు. ఏదో సంద‌ర్భంలో 'మ‌హాభారతం' గురించి ఆయ‌న మాట్లాడుతూనే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి కంటే ముందుగానే అమీర్ ఖాన్ 'మ‌హాభారతాన్ని' ప‌ట్టాలెక్కించేలా క‌నిపిస్తున్నారు. ఒక‌వేళ 'మ‌హాభారతం' మొద‌లైతే? అందులో అమీర్ ఖాన్ పోషించే పాత్ర ఏది అవుతుంది? అన్న దానిపై అప్ప‌ట్లో డిబేట్లు న‌డిచాయి. కానీ అప్పుడు అమీర్ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. కానీ తాజాగా ఇందులో శ్రీకృష్ణుడు పాత్ర పోషించాల‌నుకుంటున్న‌ట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

ఆ పాత్ర త‌న‌ను ఎంత‌గానో ప్రభావితం చేసింద‌న్నారు. త‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డిన పాత్ర‌గా అభివ‌ర్ణించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని ఇంత‌వ‌ర‌కు మించి ఎక్కువ‌గా మాట్లాడ‌లేన‌ని ముగించారు. అలాగే గ‌తంలో 'మ‌హా భారతం' గురించి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని...ప‌నులు ప్రారంభిస్తాన‌ని రాయ‌డానికే కొన్ని సంవ త్స‌రాలు ప‌డుతుంద‌న్నారు. ఆ కార‌ణంగానే సిరీస్ లు గా దీన్ని తీయాల‌నుకున్న‌ట్లు తెలిపారు.

అయితే అమీర్ ఖాన్ తాజా ప్ర‌క‌ట‌న బ‌ట్టి 'మ‌హాభారతం' ప‌నుల్ని ఆయ‌న ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రైటింగ్ ప‌నులు మొద‌లు పెట్టారు. శ్రీకృష్ణ పాత్ర పోషిస్తున్న‌ట్లు రివీల్ చేసారు అంటే? 'మ‌హాభారతం'పై ఆయ‌న సీరియ‌స్ గా ప‌నిచేస్తున్న‌ట్లు అర్ద‌మ‌వుతుంది. మ‌రి ఇది ఎప్పుడు మొద‌లవుతుంది? ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఇత‌ర న‌టీన‌టులు ఎవ‌రు? అన్న స‌మ‌స్త స‌మాచారం అతికొద్ది రోజుల్లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.