Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తె నిశ్చితార్థంలో స్టార్ డాట‌ర్స్ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   4 Aug 2023 3:48 PM GMT
స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తె నిశ్చితార్థంలో స్టార్ డాట‌ర్స్ ర‌చ్చ‌
X

బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ పార్టీని నిన్న సాయంత్రం ముంబైలో నిర్వహించారు. ఈ ఏడాది మేలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా ఎంగేజ్ మెంట్ గ్రాండ్ సెలబ్రేషన్స్ లో స్టార్ కిడ్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. శ్రీ‌దేవి కుమార్తె ఖుషీ కపూర్, షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్, తివారీ డాట‌ర్ పాలక్ తివారీ, సైఫ్ ఖాన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, అమితాబ్ మ‌న‌వ‌డు అగస్త్య నందా, పూజా భేడీ కుమార్తె అలయా ఎఫ్ వంటి పలువురు స్టార్ కిడ్స్ ఈ వేడుక‌కు హాజరయ్యారు.

పార్టీలోని కొన్ని ఫోటోలు వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ గా మారాయి. ఆలియా కశ్యప్- షేన్ గ్రెగోయిర్ నిశ్చితార్థ వేడుక నుండి కొన్ని ఫోటోల‌ను అక్షత్ రాజన్, ముస్కాన్ చనానా, అదితి భాటియా తొలిగా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో కొన్ని పోస్ట్‌లను రీపోస్ట్ చేసింది.

ఇక ఆలియా కశ్యప్ ఎంగేజ్‌మెంట్ పార్టీలో షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ చిల్లింగ్ మూవ్ మెంట్ ప్ర‌త్యేకంగా హైలైట్ అయింది. నీలిరంగు చీరలో ఈవెంట్లో సుహానా దేవ‌తాక‌న్య‌ను త‌ల‌పించింది. కల్కి కూతురు ప్రియుడితో కలిసి ఈ వేడుక‌కు వచ్చింది

అలాగే నిశ్చితార్థ వేడుక‌లో న‌వ‌ జంట భారీ కేక్ కట్ చేసి డ్యాన్స్ చేసారు. వేడుక‌లో అనురాగ్ క‌శ్య‌ప్ ఎంతో హుందాగా ఆనందంగా క‌నిపించ‌గా.. కొత్త జంట అతిథులతో సంతోషంగా పోజులిచ్చారు. అనురాగ్ క‌శ్య‌ప్ కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ గ‌త రెండేళ్లుగా షేన్ తో స‌హ‌జీవనంలో ఉంది. త‌న తండ్రి గారు ఉండే ఇంట్లోనే ఒక పోర్ష‌న్ లో ఆలియా త‌న ప్రియుడితో నివ‌శించ‌డంపై ముంబై మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. తండ్రి అంగీకారంతో ఆలియా క‌శ్య‌ప్ త‌న స‌ఖుడితో డేటింగ్ ని కొన‌సాగించింది. ఇప్పుడు పెళ్లితో ఒక ఇంటివాళ్ల‌వుతుండ‌డంతో అనురాగ్ ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఆలియా ... అనురాగ్ క‌శ్య‌ప్ మొద‌టి భార్య ఆర్తి బ‌జాజ్ కుమార్తె.