Begin typing your search above and press return to search.

ఈగల్.. హై వోల్టేజ్ మాస్ ట్రాక్

'ఆడు మచ్చ' అనే సాంగ్ ను రీసెంట్ గా విడుదల. ఈ లిరికల్ వీడియో లో రవితేజ ఐ వోల్టేజ్ లుక్కుతో చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:17 AM GMT
ఈగల్.. హై వోల్టేజ్ మాస్ ట్రాక్
X

మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు మాస్ మసాలా సినిమాలతో ఆకట్టుకునే అతికొద్దిమంది హీరోలలో మన మాస్ రాజా ఒకరు. రవితేజ ఎలాంటి సినిమాలు చేసిన కూడా అందులో మాస్ ఎలివేషన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. ఇక ఇప్పుడు అతని నుంచి నెక్స్ట్ రాబోయే చిత్రం ఈగల్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాలో రవితేజ నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా పోస్టర్స్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ గా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తూ ఉంటే మాస్ రాజా రేంజ్ కు తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ కూడా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. 'ఆడు మచ్చ' అనే సాంగ్ ను రీసెంట్ గా విడుదల. ఈ లిరికల్ వీడియో లో రవితేజ ఐ వోల్టేజ్ లుక్కుతో చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు.

మంచి ఎనర్జీతో పాటలో కూడా ఊపు తీసుకొస్తూ ఉన్నాడు. ఇక ఈ పాట దేవ్‌జాంద్ స్వరపరచగా రాహుల్ సిప్లిగంజ్ చాలా పవర్ ఫుల్ గా పాడాడు. ఇక పాటలో బ్యాక్ గ్రౌండ్ చూస్తూ ఉంటే సినిమాలో ఇలాంటి వాతావరణం గట్టిగానే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మరోసారి మాస్ రాజా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లు కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి.

ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇక వాయిదా పడవచ్చు అని గాసిప్స్ ఎన్ని వస్తున్నా కూడా చిత్ర నిర్మాతలు ఎప్పటికప్పుడు క్లారిటీ అయితే ఇస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఈ సినిమాను విష్ చేయకూడదని అని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అని గట్టిగా చెబుతూ ఉన్నారు.

ఇక ప్రమోషన్స్ ద్వారా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ పాట అయితే మాస్ ఆడియన్స్ లో మరింత అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇక సినిమాలో మాత్రం అంతకుమించి అనేలా స్టప్ ఉండబోతున్నట్లు కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈగల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.