Begin typing your search above and press return to search.

సలార్ నటుడి డెడికేషన్ కి హ్యాట్సాఫ్‌

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు మరియు మలయాళ నటీ నటుల గురించి ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   18 March 2024 4:51 AM GMT
సలార్ నటుడి డెడికేషన్ కి హ్యాట్సాఫ్‌
X

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు మరియు మలయాళ నటీ నటుల గురించి ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. మలయాళ ఫిల్మ్‌ మేకర్స్ అద్భుతమైన కాన్సెప్ట్ లతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ అందరిని ఆశ్చర్యపరుచుతున్నారు.

మలయాళ నటీనటులు స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి తమకు అప్పగించిన పాత్ర కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు, ఎంత కష్టపడేందుకు అయినా సిద్ధం అంటారు. అలాంటి నటుడే పృథ్వీరాజ్ సుకుమారన్‌. ఈయన గత ఏడాది ప్రభాస్‌ సలార్ సినిమాలో నటించి నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఈనెల 28న ఆడుజీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్‌ చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. నజీబ్ అనే బానిస పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్రలకు సాధారణంగా స్టార్‌ ఇమేజ్ ఉన్న ఏ నటుడు కూడా ఒప్పుకోరు. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్‌ మాత్రం అందుకు ఒప్పుకున్నాడు అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆడు జీవితం కోసం తాను ఏకంగా 31 కేజీల బరువు తగ్గాను. నజీబ్ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. జిమ్‌ ట్రైనర్స మరియు డాక్టర్స్ పర్యవేక్షణలో నేను 31 కేజీల బరువు తగ్గాను.

ఇక ఆడుజీవితం జీవితం సినిమా షూటింగ్ ను కరోనా సమయంలో జోర్డాన్ లో చేయడం జరిగింది. ఆ సమయంలో అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నామని ఆయన చెప్పుకొచ్చాడు. సలార్ 2లో తన పాత్ర మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.