Begin typing your search above and press return to search.

వైష్ణవ్ మాస్ సినిమా రెడీ.. హిట్టొచ్చేనా?

తొలిసారి ఆయన నుంచి వస్తున్న మాస్ మసాలా మూవీ. కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 12:40 PM GMT
వైష్ణవ్ మాస్ సినిమా రెడీ.. హిట్టొచ్చేనా?
X

మెగా కాంపౌండ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. సింపుల్ గా ఎలాంటి హంగామా లేకుండా వచ్చి, ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. సింపుల్ లవ్ స్టోరీ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే, ఆ మూవీ తర్వాత ఆ క్రేజ్ ని కంటిన్యూ మాత్రం చేయలేకపోయాడు.


ఈ మూవీ అయిపోగానే కొండపొలం అనే సినిమా చేశాడు. ఇది అసలు థియేటర్ కి రాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ చేశాడు. కానీ, ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆదికేశవ అనే సినిమాతో రావడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటి వరకు వైష్ణవ్ లో రొమాంటిక్, స్టైలిష్ యాంగిల్ మాత్రమే చూసిన ప్రేక్షకులు, ఈ ఆదికేశవలో మాస్ యాంగిల్ కూడా చూడనున్నారు. తొలిసారి ఆయన నుంచి వస్తున్న మాస్ మసాలా మూవీ. కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

నవంబర్ 10వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అంటూ మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్, శ్రీలల చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. అయితే, నిజానికి ఈ మూవీ ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, చిరు, రజినీకాంత్ లాంటి హీరోల పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. తర్వాత సెప్టెంబర్ అంటూ ప్రకటించారు. అది కూడా వాయిదా వేసి, ఇప్పుడు నవంబర్ కి తీసుకువచ్చారు.

మరి, ఈ తేదీ అయినా కన్ఫామ్ చేస్తారో లేక, వాయిదా వేస్తారో చూడాలి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో శ్రీలలతో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. మరి ఈ మూవీతో అయినా ఈ మెగా మేనల్లుడు హిట్ అందుకొని ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.