Begin typing your search above and press return to search.

'ఆదికేశవ' కాన్ఫిడెన్స్.. ఏ లెవెల్లో ఉందంటే..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆదికేశవ' మూవీ నవంబర్ 24న విడుదలకు ముస్తాబవుతోంది

By:  Tupaki Desk   |   21 Nov 2023 6:23 AM GMT
ఆదికేశవ కాన్ఫిడెన్స్.. ఏ లెవెల్లో ఉందంటే..
X

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆదికేశవ' మూవీ నవంబర్ 24న విడుదలకు ముస్తాబవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్నా సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవలేదు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఆడియన్స్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విషయంలో మూవీ టీం ఫెయిల్ అయిందనే చెప్పాలి. సినిమాకి ఆడియన్స్ లో బజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆదికేశవ కోసం ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు. అటు శ్రీలీల కూడా తన కమిట్మెంట్, షూటింగ్స్ కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం మరో మైనస్ అని చెప్పొచ్చు.

తాజాగా ఇదే విషయంపై నిర్మాత నాగ వంశీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడారు. ఆదికేశవ ట్రైనర్ లంచ్ ఈవెంట్ లో భాగంగా, 'ఈ మూవీకి అనుకున్న బజ్ ఉందా?' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా నాగ వంశీ బదులిస్తూ.." ఈరోజు నుంచి మీరే చూస్తారు. ట్రైలర్ వచ్చిన రెండు రోజుల్లో ఆన్లైన్ టికెట్ ప్రారంభమయ్య సమయానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

దాంతోపాటు సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలా? వద్దా? అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం. రిలీజ్ టైం వరకు కచ్చితంగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తాం. ఇప్పటికే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెన్నైలో ఫైనల్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే శ్రీ లీల డేట్స్ సమస్యల కారణంగా ప్రమోషన్స్ కి రాలేకపోయింది.

లాస్ట్ మినెట్ లో చేసే ప్రమోషనే నాకు ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. నిన్నటి వరకు అందరూ క్రికెట్ ఫీవర్ లోనే ఉన్నారు. అందుకే సోమవారం సాయంత్రం టైలర్ లాంచ్ చేస్తే వీకెండ్ సినిమాకి రావడానికి ఇది ఒక రిఫ్రెష్ మెంట్ తో పాటు చిన్న ఇన్వైట్ లాగా అది ఉపయోగపడుతుంది" అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ.

ఇక ఆదికేశవ విషయానికి వస్తే.. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవ తేజ్ మొదటిసారి మాస్ అవుతార్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ యాక్షన్ లవర్స్ ని మెప్పించింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఆదికేశవ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.