Begin typing your search above and press return to search.

ఆదికేశవ ట్రైలర్ టాక్: వైష్ణవ్ కమర్షియల్ మాస్ డోస్

ఇంకా ఇప్పుడు మొత్తానికి నవంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై హైప్ పెంచే విధంగా ట్రైలర్ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:38 PM GMT
ఆదికేశవ ట్రైలర్ టాక్: వైష్ణవ్ కమర్షియల్ మాస్ డోస్
X

ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన వైష్ణవ తేజ్ ఆ తర్వాత ఒకే తరహా కధలు చేయకుండా కాస్త భిన్నమైన స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కొండపొలం సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన రంగ రంగ వైభవంగా.. సినిమా కూడా కొత్తగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు ఆదికేశవ అనే సినిమాతో అతను మాస్ ఆడియెన్స్ ను గట్టిగానే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది.


ఆదికేశవ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ వివిధ కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా ఇప్పుడు మొత్తానికి నవంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై హైప్ పెంచే విధంగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండిపోతుందో దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేసాడు.

అల్లరిగా తిరిగే యువకుడు ఆ తర్వాత హీరోయిన్ ను చూసి పడిపోవడం అనంతరం సడన్ గా విలన్గా వచ్చి వారిని వదిలిపెట్టను అని ఎంట్రీ ఇవ్వడం.. ఇక విలన్ కు ఎదురుగా నిలబడి హీరో ఏ విధంగా పై చేయి సాధించాడు అనే అంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వదిలారు. రెగ్యులర్ మాస్ హీరోలు చేసే కమర్షియల్ సినిమా తరహాలోనే ఆదికేశవ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

అయితే అసలైన కథ మూలం ఏదైనా కొత్త పాయింట్ తో ఉంటుందా అనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది. శ్రీలీలతో వైష్ణవ తేజ్ కెమిస్ట్రీకి తగ్గట్టుగా డైలాగ్స్ ఐతే కాస్త ఎంగేజ్ చేసే విధంగా ఉన్నాయి. ఇక యాక్షన్ డోస్ తో ఈసారి వైష్ణవ మాస్ డోస్ గట్టిగానే ఎవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఫార్మాట్ లో కామెడీ ఆ తర్వాత రొమాంటిక్ లవ్ ట్రాక్, అనంతరం హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఉండేవిధంగా లేయర్స్ కనిపిస్తున్నాయి.

అలాగే, మలయాళ నటుడు జోజు జార్జ్ పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. అపర్ణా దాస్, రాధిక మరియు సుదర్శన్ వంటి నటీనటులు ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆదికేశవ చిత్రాన్ని నవంబర్ 24 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ మాస్ ఆడియెన్స్ ను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.