రహస్య శక్తులతో 'శంబాల' టీజర్
తెలుగు సినిమాల్లో విభిన్న కంటెంట్‌కు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇక ఈసారి యువ హీరో ఆది సాయి కుమార్ కూడా అదే తరహాలో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 7 Jun 2025 12:51 PM ISTతెలుగు సినిమాల్లో విభిన్న కంటెంట్‌కు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇక ఈసారి యువ హీరో ఆది సాయి కుమార్ కూడా అదే తరహాలో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ అనే సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడే మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. ఇక టైటిల్‌కి తగినట్లుగానే టీజర్ తో మరింత హైప్ క్తియేట్ చేశారు. మిస్టరీ, మేజిక్, మరియు మానవ విపత్తుల సన్నివేశాలతో టీజర్ హైలెట్ అయ్యింది.
యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక యంగ్ హీరో ఆది సాయికుమార్‌కు ఇది పూర్తిగా డిఫరెంట్ అవతార్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ అతనిలో చూడని లుక్, యాక్షన్ మరియు ఇంటెన్సిటీ ఈ టీజర్‌తో బయటకు వచ్చింది. ఇందులో మొదట వినిపించిన వాయిస్ ఓవర్ “ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి…” అనే లైనే సినిమాపై ఆసక్తిని కలిగించేసింది.
“పంచభూతాల్ని శాసించగల శక్తి” అనే డైలాగ్స్ తో కథలో ఉన్న గంభీరతను తెలియజేస్తోంది. శాస్త్రానికి మించిన శక్తులను గుర్తించే ప్రయత్నంగా ఈ కథ ఉందనిపిస్తోంది. టీజర్‌లో చూపించిన విజువల్స్ నిజంగా కొత్తగా ఉన్నాయి. ప్రవీణ్ కె. బంగారి సినిమాటోగ్రఫీకి టాప్ లెవెల్ అనిపించేంత స్థాయిలో బిజీ నైరేటివ్‌ని బలంగా అందించాయి.
మరోవైపు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు బూస్ట్ ఇచ్చింది. విజువల్ ట్రీట్‌తో పాటుగా ఆడియో వాతావరణం కూడా అదిరిపోయేలా ఉంది. కథలో ఊరి మీద పడిన ఒక ఉల్క రూప శక్తి కారణంగా ప్రజలు చనిపోవడం, మానసికంగా ఇబ్బంది పడడం వంటి అంశాలు కథలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం హారర్ కాదు... సైంటిఫిక్ థ్రిల్లర్ కూడా కాదనిపిస్తోంది.
ఇది రెండు కోణాల్లో నడిచే మిస్టిక్ డ్రామా అని అనిపిస్తోంది. ఆ శక్తిని ఛేదించేందుకు వచ్చిన హీరో పాత్రలో ఆది సాయి కుమార్ కొత్తగా కనిపించాడు. సీరియస్ పోలీస్ లుక్కులో నటనలో కొత్త లోయర్స్‌ని టచ్ చేశాడు. ఇంతవరకూ ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఫార్ములాల్లో కనిపించిన ఆది... ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్‌కి తగ్గ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించనున్నాడన్న నమ్మకం కలుగుతోంది.
టీజర్‌లో విలన్స్, మిస్టిక్ ఎలిమెంట్స్, భయానక వాతావరణం అన్నీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆడియెన్స్ రేంజ్ కు తగ్గ స్కేల్‌కు తగిన సినిమాగా శంభాలా నిలవబోతుందన్న ఆశ ఉత్పన్నమవుతోంది. ఈ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే సినిమా మీద బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదివరకే మేకింగ్ వీడియోలతో అంచనాలు పెంచిన చిత్రబృందం, ఇప్పుడు టీజర్‌తో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
