Begin typing your search above and press return to search.

ఆది సాయికుమార్ 'ఇగో రాజా'.. మాస్ లుక్ తో సూపర్ బజ్!

ఇక సోషల్ మీడియాలో మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా మెప్పిస్తోంది. "ఉగాది సందర్భంగా ఇగో రాజా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తున్నాం.

By:  M Prashanth   |   19 March 2026 3:49 PM IST
ఆది సాయికుమార్ ఇగో రాజా.. మాస్ లుక్ తో సూపర్ బజ్!
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి మాస్ అవతార్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇగో రాజా నుంచి విడుదలైన పోస్టర్.. ఆడియన్స్ లో ఆసక్తి రేకెతిస్తోంది. తెలుగు- తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఆ సినిమాను నిర్మాత జి. సురేష్ తన ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. గురు సరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన ఆ పోస్టర్‌ లో ఆది సాయి కుమార్ ఫియర్‌ ఫుల్ లుక్‌ లో కనిపించారు. లుంగీ ధరించి, సిగరెట్ తాగుతూ విలన్స్ వైపు స్ట్రాంగ్ గా చూసే తీరు సినిమాలో యాక్షన్ డోస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో క్లియర్ గా చెబుతోంది. ప్రస్తుతం ఇగో రాజా పోస్టర్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా మెప్పిస్తోంది. "ఉగాది సందర్భంగా ఇగో రాజా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తున్నాం. ఆది తన కెరీర్‌ లోనే అత్యంత అగ్రెసివ్ అవతార్ లో కనిపించనున్నారు. ఆ సినిమా యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది" అని పేర్కొంది. ప్రస్తుతం ఇగో రాజా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే సినిమాలో తమిళ నటుడు సతీష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్‌ తో గుర్తింపు తెచ్చుకున్న సతీష్, ఇటీవల ప్రధాన పాత్రల్లో కూడా మెప్పిస్తున్నారు. ఇగో రాజాలో ఆయన హై-వోల్టేజ్ యాక్షన్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య సాగే కథ, యాక్షన్- ఎమోషన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు గురు సరవణన్, ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ వద్ద అసిస్టెంట్‌ గా పనిచేశారు. ఆయన తొలి చిత్రం కూగుల్ కుట్టప్ప (Koogle Kuttappa) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఇగో రాజాతో మరింత ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఆయనకు మూడో చిత్రం కావడం గమనార్హం. అదే సమయంలో శంభాల విజయంతో మంచి ఫామ్ లో ఉన్నారు ఆది.

ఇప్పుడు ఇగో రాజా చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది ఆయనకు తొలి తమిళ చిత్రం కావడం విశేషం. రెండు భాషల్లోనూ విడుదలయ్యే ఆ సినిమా ఆయన కెరీర్‌ కు కీలకమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇగో రాజా టెక్నికల్ టీమ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస వర్క్ చేస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా ఉగాది కానుకగా విడుదలైన పోస్టర్‌ తోనే హైప్ క్రియేట్ అవ్వగా.. ఇగో రాజా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.