Begin typing your search above and press return to search.

త్రిష మాటలకు అర్థాలేంటి..?

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోయిన్ గా రాణిస్తోంది. కాగా, దక్షిణాదిన చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:01 AM GMT
త్రిష మాటలకు అర్థాలేంటి..?
X

స్టార్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అసలు హీరోయిన్ గా ఇంతకాలం రాణించడం అంటే మామూలు విషయం కాదు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంటోంది. ఆమె వయసు తో పాటు అందం కూడా పెరుగుతోంది. రోజు రోజుకీ త్రిషలో పెరుగుతున్న గ్లామర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజు రోజుకీ పెరుగుతుందనే చెప్పొచ్చు.

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోయిన్ గా రాణిస్తోంది. కాగా, దక్షిణాదిన చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులోనూ దాదాపు అందరు టాప్ హీరోలతో ఆమె పాడారు. వారిలో వెంకటేష్ కూడా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ మూవీ ప్రేక్షఖుల ముందుకు వచ్చి 17ఏళ్లు అవుతోంది. అయితే, ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రెడీ అవుతోందట. ఈ విషయాన్నిఇన్ డైరెక్ట్ గా త్రిష చెప్పడం విశేషం. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆయన పదేళ్ల క్రితం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి తాజాగా త్రిష రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

పదేళ్ల క్రితం డైరెక్టర్ సెల్వ రాఘవన్ 'ఇప్పుడే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూశాను. వెంకీ, త్రిష తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఇప్పుడు త్రిష రిప్లై ఇచ్చారు. తాను సీక్వెన్స్ లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

అయితే, త్రిష సీక్వెన్స్ పై హింట్ ఇస్తుందా లేక, ఆయన రిప్లై పై వెటకారం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. నిజంగా సీక్వెన్స్ అయితే, ఈ విషయంలో అలాంటి కథ వారికి సెట్ అవుతుందా లేదో కూడా చూడాలి. త్రిష ఇప్పటికీ అందంగానే ఉంది. కానీ, వెంకటేష్ కే అలాంటి కథలు నప్పుతాయా? ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో చూడాలి. ఆ సినిమా అప్పుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, పాటలు బాగా క్లిక్ అయ్యాయి.