అట్లీ - అల్లు.. అటు ఇటు తిరిగి మళ్ళీ అతని వద్దకే..
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, మాస్ కంటెంట్ మాస్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 9:00 PM ISTపాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, మాస్ కంటెంట్ మాస్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మార్క్ మాస్ యాక్షన్ తో పాటు బన్నీ స్టైలిష్ అవతారం ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అందరిలో కలుగుతోంది.. "మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?" అనిరుధ్ పేరు గతంలో బలంగా వినిపించినా, అతని డేట్స్ క్లాష్ వల్ల కుదరలేదట.
తాజాగా మరో టాక్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. అట్లీ - అల్లు కాంబోకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. అనిరుద్ కంటే ముందే అతని పేరు చర్చల్లోకి వచ్చింది.. కానీ ఎందుకో ఫైనల్ చేయలేకపోయారు. అయితే కోలీవుడ్‌లో ప్రస్తుతం సాయికి ఉన్న క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ సమాచారం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.
ఇప్పటికే సాయి అభ్యంకర్ సూర్య నటిస్తున్న "కరుప్పు" సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న "బెంజ్", ప్రదీప్ రంగనాథన్ "డ్యూడ్" సినిమాలకూ పని చేస్తున్నాడు. యువ సంగీత దర్శకుడిగా అతని పనితీరు, టెక్నికల్ విజన్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అట్లీ, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్థాయిలో ఉన్న కాంబో కోసం అతడిని ఎంపిక చేయడం కూడా అతని టాలెంట్‌కు నిదర్శనం. ఈసారి మాస్ అండ్ క్లాస్ కలిపేలా మ్యూజిక్ కావాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇప్పటికే బయటకు వచ్చిన ప్రీ ప్రొడక్షన్ స్టిల్స్, ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బన్నీ బ్లాక్ లుక్స్‌తో కనిపించిన ఒక పోస్టర్ అభిమానులను ఫిదా చేసింది. ఇక సాయి అభ్యంకర్ పేరు కన్ఫామ్ కావడంతో అతని మ్యూజిక్ బీట్ ఎలా ఉండబోతుందన్నది హాట్ చర్చగా మారింది. బన్నీకి తగిన బాస్ బీజీఎం వస్తుందా.. థియేటర్లలో ఫాన్స్ ను కిక్కిస్తాడా అన్నది అంచనాల్లో భాగమైంది. ఇప్పటికే సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్యాధునిక సాంకేతికతను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్‌గా, మ్యూజికల్‌గా హై రిచ్ స్టాండర్డ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అట్లీ మొదటి షెడ్యూల్‌ను సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.
