'ఏ' సర్టిఫికెట్ తో అంతా లాభమేనా!
ఒకప్పుడు `ఏ` సర్టిఫికెట్ సినిమా అంటే? నిర్మాతలు భయపడేవారు.` ఏ` పట్టాతో సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా? రారా? అన్న సందేహం ఉండేది.
By: Tupaki Desk | 29 Jun 2025 9:00 PM ISTఒకప్పుడు `ఏ` సర్టిఫికెట్ సినిమా అంటే? నిర్మాతలు భయపడేవారు.` ఏ` పట్టాతో సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా? రారా? అన్న సందేహం ఉండేది. ఏ పట్టా చిత్రాన్ని ఓ బూతు సినిమాలా చిత్రీక రించేవారు. సినిమాలో రకరకాల అంశాల ఆధారంగా` ఏ` సర్టిపికెట్ వస్తుంది. కానీ అంశం ఏదైనా ఆ చిత్రం ఓ బోల్డ్ సినిమాగా మార్కెట్ లోకి వెళ్లిపోయేది. దీంతో ఓ సెక్షన్ ఆడియన్స్ కే ఆ సినిమా పరిమిత్యేది. సాధారణ జనాలు పెద్దగా థియేటర్ కు వెళ్లి చూసేవారు కాదు.
వాటిని బీ గ్రేడ్ చిత్రాలుగా చూసేవారు. అందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా లేకపోయినా? బీగ్రేడ్ కోటాలో పడిపోయేది. దీంతో ఏ సర్టిఫికెంట్ అంటే? నిర్మాతలకు ఓ హడల్ గా ఉండేది. ఎలాగైనా కిందా మీద పడి యూ /ఏ సర్టిఫికెంట్ కోసం ప్రయత్నాలు చేసి రిలీజ్ చేసుకునేవారు. `ఏ `అన్నది యాక్షన్, రొమాన్స్ కంటెంట్ శ్రుతి మించి ఉన్నా? వివాదాస్పద కంటెంట్ ఉన్నా మంజూరు అవుతుంటుంది అన్నది అప్పట్లో ప్రేక్షకులకు పెద్దగా అవగాహన ఉండేది కాదు.
అందుకే నిర్మాతలు ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ చేయాలంటే భయపడేవారు. అయితే నేడు ట్రెండ్ మారింది. ఏ సర్టిఫికెంట్ అంటే జనాలు ఎగేసుకుని మరీ థియేటర్ వస్తున్నారు. ఏ సర్టిఫికెట్ చిత్రమైతో ఏదో అతిగానే ఉందని..ఓసారైనా ఆ సినిమా చూడాలి? అన్న ఆలోచన ధోరణి చాలా మంది ఆడియన్స్ లో కనిపిస్తుంది. నిర్మాతలు కూడా ఏ సర్టిఫికేషన్ అనే సిరికి ఎలాంటి సంతోషంగా తీసుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే యూ /ఏ కంటే ఏ సర్టిఫికెట్ కావాలని తీసుకునే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. `ఏ` కున్న డిమాండ్ మేరకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి? అన్న ఆలోచన నిర్మాతల్లో కనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాల కంటే ఏ సర్టిపికెట్ సినిమాల్లో రొమాన్స్, యాక్షన్, ఘాడత ఎక్కువ ఉంటుంది? కొత్తగా ఏదో చెప్ప బోతున్నారు? అనే అంశం...అవేర్ నెస్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో `ఏ` సర్టిపికెట్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది.
