Begin typing your search above and press return to search.

96 మూవీ ఆ హీరోతో చేయాల్సింద‌ట‌!

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన క్లాసిక్స్ లో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన 96 ఒక‌టి అన‌డంలో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు.

By:  Tupaki Desk   |   10 July 2025 3:00 PM IST
96 మూవీ ఆ హీరోతో చేయాల్సింద‌ట‌!
X

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన క్లాసిక్స్ లో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన 96 ఒక‌టి అన‌డంలో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. త‌మిళంలో భారీ సక్సెస్ అయిన ఈ సినిమాను శ‌ర్వానంద్, స‌మంత‌తో క‌లిసి జాను అనే టైటిల్ తో టాలీవుడ్ లోకి రీమేక్ కూడా చేశారు.

త‌మిళంలో 96కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమారే టాలీవుడ్ లో జాను సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఒరిజిన‌ల్ మూవీ లో విజ‌య్ సేతుప‌తి, త్రిష యాక్టింగ్ చూశాక జాను సినిమా ఆడియ‌న్స్ మైండ్ లోకి పెద్ద‌గా వెళ్ల‌లేదు. అయితే ఆడియ‌న్స్ గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ఈ సినిమాను డైరెక్ట‌ర్ ముందుగా విజ‌య్ సేతుప‌తితో తీయాల‌నుకోలేద‌ట‌.

ఇంకా చెప్పాలంటే 96 మూవీని డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ అస‌లు త‌మిళంలోనే చేయాల‌నుకోలేద‌ట‌. డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ ముందు ఈ సినిమాను బాలీవుడ్ లో చేయాల‌నుకున్నార‌ట‌. బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ తో ఈ సినిమాను చేయాల‌నే క‌థ‌ను రాసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమారే ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట పెట్టారు.

కానీ ఆ టైమ్ లో అభిషేక్ ను ఎలా కాంటాక్ట్ అవాల‌నేది తెలియ‌క త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష‌తో 96ను తీశాన‌ని ఆయ‌న తెలిపారు. త‌న తండ్రి నార్త్ ఇండియాలో పెర‌గ‌డం వ‌ల్ల ఆయ‌న ప్ర‌భావం త‌న‌పై ఎక్కువ‌గా ఉండేద‌ని, అందులో భాగంగానే తాను ఎప్పుడూ హిందీ సినిమాలు చూసేవాడిన‌ని, హిందీ సినిమాలు ఎక్కువ‌గా చూడటం వ‌ల్ల త‌న‌కు హిందీ వ‌చ్చ‌ని, 96ను బాలీవుడ్ లో చేస్తే మంచి ఫ‌లితాలొస్తాయ‌ని ఆ సినిమాను హిందీలో చేయాల‌నుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.