ప్యూర్ లవ్ స్టోరీతో '8 వసంతాలు'.. ట్రైలర్ లో ఒక్కో డైలాగ్ డైమండే!
సూపర్ హిట్ మూవీ మ్యాడ్ ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ ప్రధానపాత్రలో రూపొందుతున్న సినిమా 8 వసంతాలు.
By: Tupaki Desk | 15 Jun 2025 2:44 PM ISTసూపర్ హిట్ మూవీ మ్యాడ్ ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ ప్రధానపాత్రలో రూపొందుతున్న సినిమా 8 వసంతాలు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఆ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మ్యాసివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. పాజిటవ్ వైబ్స్ క్రియేట్ చేసింది. మేకర్స్ లో ఫుల్ జోష్ నింపింది. అదే ఉత్సాహంతో మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 8 ఏళ్ల పాటు ఓ మహిళ ఆనందం, కన్నీళ్లు, పాఠాలు అంటూ స్టోరీ లైన్ చెబుతూ విడుదల చేశారు.
అయితే 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'పనికి రారా.. పేగు పంచి ప్రాణం పోయిగలిగే వాళ్లం.. చితి ముట్టించి మోక్షం ఇప్పించ లేమా' అంటూ వెంటనే అనంతిక ఎమోషనల్ గా చెబుతారు. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటారు.
పలు యాక్షన్ సీన్స్ లో కొందరిని చితక్కొడతారు. ఆ తర్వాత ట్రైలర్ లవ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ప్రేమ కోసం ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ను రివీల్ చేశారు మేకర్స్. జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు, మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అంటూ వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
చివరగా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను చూపించిన మేకర్స్.. ట్రైలర్ ను ఎండ్ చేశారు. ఓవరాల్ గా గ్లింప్స్.. మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కచ్చితంగా మూవీ చూడాలనిపించేలా ట్రైలర్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ట్రైలర్ లో విజువల్స్ చాలా డీసెంట్ గా.. కూల్ గా ఆకర్షించేలా ఉన్నాయి. లొకేషన్స్ అయితే వేరే లెవెల్. అనంతిక తన రోల్ లో జీవించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనే చెప్పాలి. హృదయాన్ని హత్తుకునే స్టోరీతో సినిమా తీస్తున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. మరి జూన్ 20వ తేదీన రిలీజ్ కానున్న 8 వసంతాలు మూవీ ఇప్పుడు ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
