80స్, 90స్ బ్యాక్ డ్రాప్.. సక్సెస్ ఫార్ములానా?
గతాన్ని గుర్తు చేసే 80, 90స్ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా వచ్చిన లెనిన్ సినిమా ఆ చర్చను మరోసారి స్టార్ట్ చేసింది.
By: M Prashanth | 11 July 2026 10:49 AM ISTఒకప్పుడు లెటర్ల ద్వారా ప్రేమలు.. వీధుల్లో గొడవలు.. క్యాసెట్ పాటలతో సాగే జీవితం.. ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. గతాన్ని గుర్తు చేసే 80, 90స్ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా వచ్చిన లెనిన్ సినిమా ఆ చర్చను మరోసారి స్టార్ట్ చేసింది. 1986 కాలం నేపథ్యంలో సాగే ఆ మూవీ బ్యాక్ డ్రాప్ ఆకట్టుకోవడంతో అసలు రెట్రో నేపథ్యం సినిమాలకు విజయాన్ని గ్యారెంటీ చేస్తుందా అనే ప్రశ్న మళ్లీ వినిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రెట్రో నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి. అయితే వాటిలో విజయం సాధించినవి చూస్తే.. కేవలం పాత కాలాన్ని చూపించడం వల్ల కాదు, స్ట్రాంగ్ కథ కారణంగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పాలి. కథకు తగ్గట్టుగా ఆ కాలం వాతావరణాన్ని చూపిస్తే ప్రేక్షకుడు అందులో లీనమవుతాడు. అదే కథ వీక్ గా ఉంటే ఎంత గొప్ప సెట్స్ వేసినా, పాతకాలపు వస్తువులు చూపించినా ప్రయోజనం ఉండదు.
80, 90స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు మెయిన్ స్ట్రెంత్ నోస్టాల్జియా. ఆ కాలంలో పెరిగిన ఆడియన్స్ కు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అప్పటి లైఫ్ స్టైల్, పల్లెటూరి వాతావరణం, సైకిళ్లు, క్యాసెట్లు, పాత బస్సులు, సంప్రదాయ దుస్తులు వంటి అంశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అందుకే ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు కథతో పాటు ఆ కాలాన్ని కూడా ఆస్వాదిస్తారు.
అంతేకాదు.. అప్పట్లో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ప్రేమకథలు, కుటుంబ కథలు, రివెంజ్ డ్రామాలు మరింత నేచరుల్ గా అనిపిస్తాయి. పాత్రల మధ్య అపార్థాలు, ఎమోషన్స్, కథను మరింత బలంగా నిలబెడతాయి. అందుకే రెట్రో బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాలకు మంచి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫార్ములాకు మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు ఆ కాలంతో రిలేషన్ ఉండదు. కాబట్టి కేవలం నోస్టాల్జియాపైనే సినిమా నడిస్తే యువతను థియేటర్లకు రప్పించడం కష్టమవుతుంది. అందుకే కథ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. మరో ముఖ్యమైన అంశం ప్రొడక్షన్ ఖర్చు. అప్పటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే భారీ సెట్స్, పాత వాహనాలు, అప్పటి వస్తువులు, కాస్ట్యూమ్స్ అవసరమవువుతాయి. దీనివల్ల బడ్జెట్ పెరుగుతుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ప్రొడ్యూసర్లకు నష్టాలు తప్పవనే చెప్పాలి.
రంగస్థలం, మహానటి, శ్యామ్ సింగ రాయ్, దసరా వంటి సినిమాలు రెట్రో నేపథ్యంలో మంచి విజయాలు అందుకున్నాయి. అయితే వాటి విజయానికి ప్రధాన కారణం కథ, పాత్రలు, భావోద్వేగాలే తప్ప బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు లెనిన్ 80స్ బ్యాక్ డ్రాప్ రివెంజ్ కథతో రూపొందింది. సినిమాలో కొన్ని మైనస్లపై చర్చ జరిగినప్పటికీ.. కథలోని ఎమోషన్, అప్పటి ఎన్విరాన్మెంట్ చూపించిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అదే సమయంలో బ్యాక్ డ్రాప్ ఎప్పుడూ సక్సెస్ ఫార్ములా కాదు. స్టోరీ, రోల్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే రెట్రో వరల్డ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. లేకుంటే విజయం దక్కదని చెప్పాలి.
