Begin typing your search above and press return to search.

8 వసంతాలు.. సినిమాటోగ్రాఫర్‌ అలా చేశారేంటి?

అదే సమయంలో సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:49 PM IST
8 వసంతాలు.. సినిమాటోగ్రాఫర్‌ అలా చేశారేంటి?
X

మ్యాడ్‌ ఫేమ్‌ అనంతిక సనిల్‌ కుమార్‌ లీడ్ రోల్ లో 8 వసంతాలు మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, సమీరా కిశోర్‌, కన్నా పసునూరి ముఖ్యపాత్రల్లో నటించారు.

అయితే రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న 8 వసంతాలు మూవీ.. జూన్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. అనుకున్నంత స్పందన మాత్రం రాలేదు. కవితాత్మకమైన టచ్ కలిగి ఉన్నప్పటికీ, దానికి పెద్దగా సానుకూల స్పందన రాలేదని చెప్పాలి.

దీంతో ఇప్పుడు మేకర్స్.. ప్రమోషన్లను స్ట్రాంగ్ గా నిర్వహించాలి. కానీ తాజాగా జరిగిన కార్యక్రమానికి డైరెక్టర్ నరేంద్ర రాలేదు. నిర్మాతలూ కనిపించలేదు. దీంతో ఈవెంట్ కు వారు రాకపోవడం గమనార్హం. మూవీ టీమ్.. తమ సినిమాను సూపర్ హిట్ అని చెప్పింది. అదే సమయంలో సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

వేడుకలో మాట్లాడుతూ.. "సినిమా త్వరలో ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్‌ ఫ్లిక్స్‌ లో రానుంది. థియేటర్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్‌ కంటే ఇంకా బెటర్‌ ఎక్స్పీరియన్స్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో ఉండబోతుంది. ఇమేజ్‌ క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది" అని విశ్వప్రసాద్ అన్నారు. అలా తమ సినిమాను ఓటీటీలో చూడమని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లు అయింది.

థియేటర్లకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో వేచి ఉండి చూడమని ఆయన పరోక్షంగా ప్రజలను కోరుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత స్టేజ్ పై ఉన్నవారు కలుగజేసుకోవడంతో స్టేజీపై సారీ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా.. సినిమా మేకర్స్ మొదట పెద్ద స్క్రీన్‌ పై సినిమాను ఆస్వాదించాలని.. ఆ తర్వాత దానిని ఓటీటీలో మరోసారి చూడాలని చెబుతుంటారు. కానీ విశ్వనాథ్ రెడ్డి కామెంట్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీంతో థియేటర్‌ లో సినిమా చూడాలనుకునే ఆడియన్స్ లో కొందరు.. తమ మనసులు మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాల్సిందే.