మైత్రీకి లాభాల పంట ఖాయమేనా?
టాలీవుడ్ లో ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 8 వసంతాలు సినిమా కూడా ఒకటి.
By: Tupaki Desk | 18 Jun 2025 6:10 PM ISTటాలీవుడ్ లో ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 8 వసంతాలు సినిమా కూడా ఒకటి. దీంతో పాటే అదే రోజున ధనుష్- నాగార్జున- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేర కూడా రిలీజవుతుంది. కుబేర తో కంపేర్ చేస్తే 8 వసంతాలు చిన్న సినిమానే అయినప్పటికీ, ఈ రోజుల్లో చిన్న సినిమా అని లైట్ తీసుకోవడానికి లేదు.
చిన్న సినిమాలుగా రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలు ఈ మధ్య ఎన్నో ఉన్నాయి. టిల్లూ ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ మత్తు వదలరా రెండు సినిమాలు, రీసెంట్ గా వచ్చిన కోర్టు ఎలాంటి సక్సెస్ ను అందుకున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థలు కూడా చిన్న, మీడియం రేంజ్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాయి.
అందులో భాగంగానే కథ నచ్చడంతో కొత్త వాళ్లైనప్పటికీ కథను నమ్మి 8 వసంతాలు సినిమా చేశారు మైత్రీ నిర్మాతలు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ముందు అనుకున్న బడ్జెట్ రూ.4 కోట్లు. కానీ తీరా సినిమా పూర్తయ్యే నాటికి అది రూ. 12 కోట్లకు చేరింది. బడ్జెట్ పెరగడంతో అవుట్‌పుట్ కూడా బాగా వచ్చిందంటున్నారు. ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రూపంలో రూ.9 కోట్లు నిర్మాతలకు వచ్చేశాయి.
అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవాలంటే రావాల్సింది మరో మూడు కోట్లు మాత్రమే. మైత్రీ బ్రాండింగ్ తో రిలీజ్ అవుతున్న 8 వసంతాలు సినిమాకు అది పెద్ద కష్టమేమీ కాదు. దానికి తోడు ఎలాగూ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ ఆడియన్స్ కు మంచి ఫీల్ ను అందించడంతో పాటూ సినిమాపై అంచనాలను కూడా బాగా పెంచాయి.
కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే మైత్రీ నిర్మాతలకు లాభాల పంట ఖాయం. అసలే ఈ మధ్య టాలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు 8 వసంతాలు సినిమాకు మంచి టాక్ వస్తే ఆ లోటు తీరినట్టే. యూత్ కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టే ఛాన్సుంది. సినిమాపై నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాకు ముందు రోజే ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది.
