Begin typing your search above and press return to search.

ఈ వారం 7 సినిమాలు.. మీ ఛాయిస్ ఏంటి?

అందులో ఐదు స్టెయిట్ సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. వీటితోపాటు ఓ మూవీ రీరిలీజ్ కూడా కానుంది. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:30 AM GMT
ఈ వారం 7 సినిమాలు.. మీ ఛాయిస్ ఏంటి?
X

ప్రతి వారంలానే ఈ వీక్ కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. అనేక కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. ఒక్క శుక్రవారమే మొత్తం ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఐదు స్టెయిట్ సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. వీటితోపాటు ఓ మూవీ రీరిలీజ్ కూడా కానుంది. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

సిద్ధార్థ్ రాయ్.. మరో అర్జున్ రెడ్డి అవుతుందా?

చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం సిద్ధార్థ్ రాయ్... ఈ వారమే విడుదల కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో అర్జున్ రెడ్డి మూవీని గుర్తుతెచ్చిన ఈ మూవీ.. ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. తన్వి నేగి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

ఇద్దరు కమెడియన్లు సై!

టాలీవుడ్ కమెడియన్లు వైవా హ‌ర్ష, ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్ అభిన‌వ్ గోమ‌ఠం హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలు.. ఈ వారమే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సుంద‌రం మాస్ట‌ర్, మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలు ఫిబ్రవరి 23వ తేదీనే విడుదల అవుతున్నాయి. రెండు మూవీలు కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్లుగా తెరకెక్కాయి. ఈ మూడు సినిమాల‌తో పాటు అల్లు అర్జున్ కజిన్ విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటించిన ముఖ్య‌గ‌మ‌నిక‌, గ్రౌండ్ సినిమాలు కూడా విడుదలవ్వనున్నాయి.

డ‌బ్బింగ్ సినిమాలు ఇవే!

మలయాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన భ్ర‌మ‌యుగం సినిమా ఫిబ్ర‌వ‌రి 23న తెలుగులో విడుద‌ల‌ అవుతోంది. ఈ మూవీని ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ లో విడుదల చేస్తోంది. అయితే గతవారం మ‌ల‌యాళంలో గ‌త వారం రిలీజై మ‌మ్ముట్టి కెరీర్‌ లో హైయ్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది.

కీర్తి సురేష్ పోలీస్ గా!

భ్రమ యుగంతోపాటు జ‌యం ర‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తి సురేష్ యాక్ట్ చేసిన త‌మిళ డ‌బ్బింగ్ మూవీ సైర‌న్ కూడా ఈ శుక్ర‌వార‌మే తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించింది. తమిళంలో మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న ఈ మువీ.. తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఒక్కడు రీరిలీజ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవర్ గ్రీన్ మూవీ ఒక్కడు రీరిలీజ్ అవ్వనుంది. ఫిబ్రవరి 23,24,25 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ తో విడుదల చేయనున్నారు. ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించగా.. గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండింగే. మరి ఈ సినిమా రీరిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ సినిమాలన్నింటిలో మీ ఛాయిస్ ఏంటి?