Begin typing your search above and press return to search.

హిట్టు లవ్ స్టొరీ సీక్వెల్.. స్ట్రాంగ్ స్కెచ్

7/G బృందావన్ కాలనీని ఏఎం రత్నం నిర్మించారు. ఈ సీక్వెల్ కూడా అతనే నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Aug 2023 5:01 AM GMT
హిట్టు లవ్ స్టొరీ సీక్వెల్.. స్ట్రాంగ్ స్కెచ్
X

2004లో వచ్చిన 7/G బృందావన్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రేమ కథలలో ఇప్పటికి ఎవర్ గ్రీన్ మూవీగా ఇది నిలిచిపోతుంది. రవికృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అతన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అయితే రవికృష్ణ 7/G బృందావన్ కాలనీ తర్వాత చాలా సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

దీంతో సినిమాలకి దూరమై వ్యాపారాలు చేసుకుంటున్నారు మరల 19 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతోంది. కథ ఎలా ఉండబోతోందనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ రవికృష్ణనే ఈ మూవీలో కూడా లీడ్ రోల్ లో నటించబోతున్నాడంట. సెల్వం రాఘవన్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ అనశ్వర్ రాజన్ ని ఎంపిక చేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ మధ్యలో హీరోయిన్ గా కూడాతన అదృష్టం పరీక్షించుకుంటున్న అనశ్వర్ రాజన్ కి ఇది పెద్ద అవకాశం అని చెప్పొచ్చు. 7/G బృందావన్ కాలనీని ఏఎం రత్నం నిర్మించారు. ఈ సీక్వెల్ కూడా అతనే నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందంట.

చాలా కాలం నుంచి ఈ మూవీ హీరో రవికృష్ణకి మీడియాకి కనిపించడం లేదు. దీంతో బాడీ ఫార్మేషన్, లుక్స్ పైన ఫోకస్ పెట్టినట్లు కోలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. సెల్వ రాఘవన్ అంటే కచ్చితంగా బలమైన కథ, కథనాలతోనే మూవీ చేస్తాడనే పేరు ఉంది. మరి ఈ సీక్వెల్ కి ఎలాంటి స్టోరీ లైన్ ని సిద్ధం చేసాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గత కొద్ది రోజులుగా సౌత్ సర్కిల్ లో 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ పైనే చర్చ నడుస్తోంది. దర్శకుడు సెల్వ రాఘవన్ క్యాస్టింగ్ సెలక్షన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మరి మొదటి చిత్రం స్థాయిలో ఈ సీక్వెల్ ఏమైనా అద్భుతం చేయగలుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.