Begin typing your search above and press return to search.

బృందావన్ కాలనీ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌

మొదటి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవికృష్ణ ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా తో కూడా ఆకట్టుకోలేకపోయాడు

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:47 AM GMT
బృందావన్ కాలనీ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌
X

రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్‌ హీరోయిన్‌ గా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన "7/G బృందావన్ కాలనీ" భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో యూత్‌ కి పిచెక్కించిన ఈ సినిమా తో రవికృష్ణ స్టార్‌ గా గుర్తింపును దక్కించుకున్నాడు.

మొదటి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవికృష్ణ ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కొన్నాళ్లుగా కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇప్పుడు "7/G బృందావన్ కాలనీ" సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా నిర్మాత ఆ విషయంపై ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు.

దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా సీక్వెల్‌ చర్చలు జరుగుతున్నాయి. సోనియా అగర్వాల్‌ స్థాయిలో ఆకట్టుకోగల నటి కోసం మేకర్స్ చాలా కాలంగా వెతకుతూ ఉన్నారు. కొత్త ఫేస్ అయి ఉండాలి, అంతే కాకుండా నటనలో మంచి ప్రతిభ కనబర్చిన అమ్మాయి అయి ఉండాలి అనుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు మేకర్స్ కోరుకున్న లక్షణాలతో హీరోయిన్‌ లభించిందట.

కోలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చైల్డ్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. మలయాళ మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది. బాలీవుడ్‌ లో కూడా యారియన్‌ 2 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనశ్వర రాజన్‌ ను "7/G బృందావన్ కాలనీ" సీక్వెల్‌ కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో అనశ్వర రాజన్‌ ఫోటో షూట్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. కమర్షియల్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె అందం ఉంది అంటూ నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. కనుక "7/G బృందావన్ కాలనీ" సినిమాకు ఈమె మంచి ఎంపిక అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.