4 బడా మూవీల రిలీజ్ మంత్స్.. అది నిజమేనా?
టాలీవుడ్ లో బడా హీరోలందరూ తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. షూటింగ్స్ లో పాల్గొంటూ తమ షెడ్యూల్స్ ను పూర్తి చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 July 2025 5:32 PM ISTటాలీవుడ్ లో బడా హీరోలందరూ తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. షూటింగ్స్ లో పాల్గొంటూ తమ షెడ్యూల్స్ ను పూర్తి చేస్తున్నారు. అందులో కొందరు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకున్నారు. మరికొందరు త్వరలో విడుదల తేదీలను అనౌన్స్ చేయనున్నారు. ఆ జాబితాల్లో చాలా మంది హీరోలున్నారు.
అయితే కొంతకాలంగా బడా హీరోలు నటిస్తున్న సినిమాల విడుదల తేదీల ప్రకటనలు వస్తున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం మారుతున్నాయి. అనేక కారణాల వల్ల ఛేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజీ, విశ్వంభర, అఖండ 2, రాజా సాబ్ సినిమాల విడుదలకు సంబంధించిన ఓ రూమర్ ఫుల్ గా స్ప్రెడ్ అవుతోంది.
అది నిజమో కాదో తెలియక పోయినా.. వైరల్ మాత్రం అవుతోంది. సెప్టెంబర్ లో పవన్ కల్యాణ్ ఓజీ.. అక్టోబర్ లో చిరంజీవి విశ్వంభర.. డిసెంబర్ లో బాలకృష్ణ అఖండ-2.. 2026 జనవరిలో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అవుతాయని ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. వైరల్ మాత్రం అవుతోంది.
అయితే పవన్, సుజీత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజీ మూవీ.. సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ గా ఆ విషయాన్ని క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో ఆ రూమర్ లో ఓజీడి రిలీజ్ మంత్ నిజమేనని చెప్పవచ్చు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఆ తర్వాత విశ్వంభర సినిమా విషయానికొస్తే.. చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఇప్పటికే థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు అక్టోబర్ లో సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఇక అఖండ-2 సెప్టెంబర్ లోనే విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే అనుకున్న డేట్ కే మేకర్స్ రిలీజ్ చేస్తున్నారని.. ప్రస్తుతం థియేటర్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అదే సమయంలో ప్రభాస్ లీడ్ రోల్ లో మారుతి రూపొందిస్తున్న రాజా సాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దాన్ని వచ్చే సంక్రాంతికి పోస్ట్ పోన్ చేస్తారని రూమర్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి పలువురు బడా హీరోలు చిత్రాలు కర్చీఫ్ వేసేశాయి. ఏదేమైనా ఓజీ తప్పితే.. రాజా సాబ్, విశ్వంభర, అఖండ-2 రిలీజ్ కు సంబంధించిన రిలీజ్ మంత్స్ గాసిప్ లో నిజమెంతో చూడాలి.
