Begin typing your search above and press return to search.

ఒకే బ్యాక్ డ్రాప్ లో మూడు కథలు ముగ్గురు హీరోలు

ఈ మూడు సినిమాలు కూడా 24 గంటలు గ్యాప్ లోనే అఫీషియల్ పోస్టర్స్ తో కన్ఫర్మ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   28 July 2023 12:28 PM GMT
ఒకే బ్యాక్ డ్రాప్ లో మూడు కథలు ముగ్గురు హీరోలు
X

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఈ యాదృచ్ఛికంగా వస్తాయో, లేదంటే వేరే కారణం ఏమైనా ఉంటుందో తెలియదు కానీ ఇంచుమించు ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలం లో నాచురల్ స్టార్ నాని అంటే సుందరానికి, నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి సినిమాలు ఒకే స్టోరీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయి లో సక్సెస్ అందుకోలేదని చెప్పాలి.

గతం లో టెంపర్, పటాస్ సినిమా కథలు కూడా ఇంచుమించు ఒకే లైన్ తో తెరకెక్కయి. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లైన్ తో మూడు సినిమాలు అనౌన్స్ కావడం విశేషం. ఈ మూడు సినిమాలు కూడా 24 గంటలు గ్యాప్ లోనే అఫీషియల్ పోస్టర్స్ తో కన్ఫర్మ్ అయ్యాయి.

అందులో వరుణ్ తేజ్ హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా టైటిల్ తో ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ మనీ బ్యాక్ డ్రాప్ కావడం విశేషం. అలాగే తమిళ్ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో D51 మూవీ కాన్సెప్ట్ పోస్టర్ తో ప్రకటించారు. ఈ చిత్రం కూడా డబ్బు బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుంది.

తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ టైటిల్ తో సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమా లో కూడా మెయిన్ స్టోరీ లైన్ డబ్బు బ్యాక్ డ్రాప్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇలా మూడు సినిమా లో ముగ్గురు హీరోలతో మనీ బ్యాక్ డ్రాప్ స్టోరీ లైన్ తోనే అనౌన్స్ కావడం విశేషం.

అలాగే మూడు సినిమాలు కూడా పిరియాడిక్ జోనర్ ఉండే కథాంశం తోనే తెరకెక్కనుండటం విశేషం. మరి ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి అయితే ఇలా ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు తెరకెక్కిన సందర్భాలు టాలీవుడ్ లో వింటేజ్ కాలం నుంచి ఉన్నాయి. అలా వచ్చినవాటి లో కొన్ని సక్సెస్ అందుకుంటే కొన్ని ఫెయిల్ అయ్యాయి.