మూడు గంటలకు పైగానే లాక్ చేసారా?
శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న `కుబేర` గ్యాంగ్ స్టర్ స్టోరీ. ఈయన సినిమాల నేరేషన్ స్లోగా ఉంటుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 2:30 AMబలమైన కథ, కథనాలతో తెరకెక్కిన సినిమాలకు నిడివితో పనిలేదు. లెంగ్త్ ఎక్కువైనా ప్రేక్షకులు ఆస్వా దించడానికి సిద్దంగా ఉంటున్నారు. మూడు గంటలకుపైగా రన్ టైమ్ తో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. `బాహుబలి`,` ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలు మూడు గంటల 2 నిమిషా ల నిడివితో రిలీజ్ అయినవే. ఆ రెండు చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే. పైగా పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో నిడివి అనేది పెద్దగా చర్చకు రాలేదు. `లియో`, `దేవర`, `సలార్` లాంటి సినిమాల రన్ టైమ్ కూడా మూడు గంటలకు పైగానే ఉంది.
ఆ మూడు సినిమాల విషయంలో టాక్ డివైడ్ గా వచ్చింది. అయినా లెంగ్త్ ఎక్కువైంది? అన్న అంశం మాత్రం ఎక్కడా తెరపైకి రాలేదు. హిందీ చిత్రమైన `యానిమల్` మూడు గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ అయింది.`బాహుబలి`ని మించిన రన్ టైమ్ ఇది. కానీ సినిమా నచ్చడంతో నిడివి నెగిటివ్ కాలేదు. తెలుగు ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా ఆస్వాదించారు. `పుష్ప2` కూడా 3 గంటల నిడివితో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
కథా బలం, ఎమోషన్ కుదిరిప్పుడు నిడివి అడ్డంకి కాదని మరసారి ప్రూవ్ అయింది. కానీ అందులో ఎక్కడా తేడా జరిగినా ఫలితం ఊహించని విధంగా ఉంటుంది. తాజాగా జూన్ లో రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు మూడ గంటలపై నిడివితోనే రిలీజ్ అవుతున్నాయని సమాచారం. `కుబేర`, `కన్నప్ప`, `హరిహరవీరమల్లు`, `కింగ్ డమ్` చిత్రాల రన్ టైమ్ తోనే రిలీజ్ అవుతున్నాయని చిత్ర వర్గాల నుంచి తెలిసింది.
శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న `కుబేర` గ్యాంగ్ స్టర్ స్టోరీ. ఈయన సినిమాల నేరేషన్ స్లోగా ఉంటుంది. దీంతో రన్ టైమ్ కి ఆస్కారం ఉంటుంది. కన్నప్ప, హరిహరవీరమల్లు పీరియా డిక్ చిత్రాలు...చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించడంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలకు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో నిడివి మూడు గంటలు దాటుతుందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న `కింగ్ డమ్` కూడా భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి.ప్లాష్ బ్యాక్ సన్నివేశాలకు ఎక్కువ సమయం తీసుకున్నారుట. ఈ క్రమంలోనే రన్ టైమ్ పెరుగుతున్నట్లు సమాచారం.