Begin typing your search above and press return to search.

'23' ట్రైలర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిందిగా!

ఇప్పుడు ఆ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ, తన్మయి, ఝాన్సీ, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2025 11:10 AM IST
23 ట్రైలర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిందిగా!
X

విభిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే.. కంటెంట్ బాగుంటే.. టాలీవుడ్ మూవీ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి. అలాంటి మూవీ మల్లేశంతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్.

ఇప్పుడు ఆ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ, తన్మయి, ఝాన్సీ, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో 99 సినిమాను రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించగా, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు సినిమా కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా రీసెంట్ గా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ గా సాగిన ట్రైలర్.. మూవీపై అందరి ఫోకస్ పడేలా చేసింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ట్రైలర్ ప్రకారం, 1991లో జరిగిన చుండూరు మారణ హత్య, 1997లో జూబ్లీహిల్స్ బాంబు దాడి వంటి పలు నిజజీవిత ఘటనల చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఒక యువ జంట కలలతో జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యం కూడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

వివిధ ఘటనల్లో న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేసిందా? అనే ప్రశ్నలతో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. తప్పుడు కేసుల్లో ఇరుక్కుని బలైపోతున్న అమాయకుల పాయింట్ ను యాడ్ చేసినట్లు అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంటూనే.. ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పాలి.

ముఖ్యంగా ట్రైలర్ లో డైరెక్టర్.. టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్క్ కే రోబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. అయితే మే 16వ తేదీన థియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది 23 మూవీ. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.