Begin typing your search above and press return to search.

అందమైన ప్రేమలేఖ వంటి సినిమాకి 22 ఏళ్లు

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో వచ్చిన 'కన్నతిల్‌ ముత్తమిట్టల్‌' సినిమాను తెలుగు లో అమృతగా డబ్బింగ్‌ చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 10:30 AM GMT
అందమైన ప్రేమలేఖ వంటి సినిమాకి 22 ఏళ్లు
X

1990, 2000 ల్లో గ్లామర్ రోల్స్ కి పెట్టింది పేరుగా సిమ్రాన్ నిలిచిన విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ తెలుగు, తమిళ మరియు హిందీ ప్రేక్షకులను తన అందంతో అలరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సిమ్రాన్ 2002 లో అమృత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో వచ్చిన 'కన్నతిల్‌ ముత్తమిట్టల్‌' సినిమాను తెలుగు లో అమృతగా డబ్బింగ్‌ చేశారు. తమిళం మరియు తెలుగు తో పాటు ఇతర అన్ని భాషల్లో కూడా అమృత మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో పాటు పలు అవార్డులు దక్కించుకుంది.

అప్పట్లోనే టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో కూడా ప్రదర్శించబడింది. సినిమా విడుదల అయ్యి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమా విశేషాలను గుర్తు చేసుకుంటూ హీరోయిన్‌ గా నటించిన సిమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమృత సినిమాలో సిమ్రాన్‌ 'ఇందిరా పాత్రలో నటించారు. సోషల్‌ మీడియా లో వీడియోను షేర్‌ చేసి.. నా జీవిత ప్రయాణంలో ఓ అందమైన ప్రేమ లేఖ వంటి సినిమా. ఇందిరా పాత్ర కంటే ఎక్కువ. ఆమె ఒక మ్యాజిక్‌, ఆ స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. నాకు జీవితంలో దక్కిన గొప్ప బహుమానాల్లో ఇందిరా ఒకటి అన్నట్లుగా భావిస్తాను అంటూ తన పాత్ర గురించి సిమ్రాన్ చెప్పుకొచ్చింది.

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన అమృత మూవీ లో మాధవన్ కీలక పాత్రలో కనిపించాడు. ఇంకా కీర్తన, ప్రకాష్‌ రాజ్‌, జేడీ చక్రవర్తి, నందితా దాస్‌, పశుపతి ఇంకా ముఖ్యలు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. అమృత ఇప్పటికి కూడా టీవీల్లో వస్తే జనాలు విపరీతంగా చూస్తారు. అందుకే చాలా మంది అమృత మూవీ రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు.