Begin typing your search above and press return to search.

2025 సంక్రాంతి.. క్రేజీ సీక్వెల్స్ సిద్ధమా?

ఈ వార్తలు నిజమైతే.. వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తమ సినిమాలతో రానున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:27 AM GMT
2025 సంక్రాంతి.. క్రేజీ సీక్వెల్స్ సిద్ధమా?
X

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద క్లాష్ సమయం ఏదన్నా ఉందంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పొచ్చు. ప్రతీ సంక్రాంతికి గొడవలు సహజంగానే జరుగుతుంటాయి. థియేటర్లు సరైన సంఖ్యలో దొరకవు. డిమాండ్ ఉన్న మూవీకి థియేటర్లు లభించవు. ఏదో ఒక సినిమా అన్నట్టుగా జనాలు కూడా ఈ హాలీడేస్‌లో చూస్తుంటారు. అందుకే సంక్రాంతి సీజన్‌ను ఎవ్వరూ వదలుకోరు.

అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ హైప్, అంచనాలతో వచ్చింది గుంటూరు కారం. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ పోటీ పడ్డాయి. జనవరి 11 సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టేశారు హనుమాన్ టీమ్ సభ్యులు. వందల కొద్దీ వేసిన ప్రీమియర్ల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కోట్లలో వచ్చాయి. ఓ సినిమాకు ఇన్ని ప్రీమియర్లు వేయడం.. అన్ని కోట్లు రావడం ఇదే మొదటి సారి అని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు. అలా హనుమాన్ సినిమాకు ఫుల్ పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. మిగతా మూడు చిత్రాలు నా సామిరంగ, సైంధవ్, గుంటూరు కారం మిక్స్ డ్ టాక్ సంపాదించాయి.

ఇక.. ఏడాది ముందుగానే 2025 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెయిన్ గా వచ్చే ఏడాది పలు సీక్వెల్ చిత్రాలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ వచ్చింది. ఈ యూనివర్స్ లో భాగంగా రెండో సినిమా అధీరను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. దిల్ రాజు కూడా తనకు కలిసి వచ్చిన శతమానం భవతి 2ను వచ్చే సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు.

నాగార్జున బంగార్రాజు సీక్వెల్ కూడా 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా సైతం వచ్చే పొంగల్ రేస్ లో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే.. వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తమ సినిమాలతో రానున్నారు. దీని బట్టి చూస్తే వచ్చే పండక్కి పోటీ గట్టిగానే కనిపిస్తోంది. మరి వీటిల్లో ఏది బరిలో ఉంటుందో.. ఏది తప్పుకుంటుందో చూడాలి.

2017 సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి విడుదలయ్యాయి. ఈ మూడూ కూడా హిట్స్ గా నిలిచాయి. ఇక 2025 పొంగల్ బరిలో విశ్వంభర, శతమానం భవతి-2తో పాటు బాలయ్య సినిమా కూడా నిలిస్తే.. 2017 వార్ రిపీట్ అవుతుంది. మరి రిజల్ట్ కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.