Begin typing your search above and press return to search.

2025 ఫస్టాఫ్.. టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

మరికొన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి నిరాశపరిచాయి. ఇంకొన్ని అనుకోని విధంగా రాణించాయి. మరి 2025 ఫస్టాఫ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

By:  Tupaki Desk   |   30 Jun 2025 9:30 AM IST
2025 ఫస్టాఫ్.. టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
X

2025 ఫస్టాఫ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ ఆరు నెలల్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరికొన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి నిరాశపరిచాయి. ఇంకొన్ని అనుకోని విధంగా రాణించాయి. మరి 2025 ఫస్టాఫ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సినిమాలతో థియేటర్స్ కొద్ది రోజుల పాటు కళకళలాడాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఊహించని రీతిలో అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. డాకు మహారాజ్ మూవీ రూ.100 కోట్లు సాధించింది. గేమ్ ఛేంజర్ చిత్రం.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మారింది.

వాటితోపాటు జనవరిలో వివిధ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ అన్నీ నిరాశపరిచాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో తండేల్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అదే నెలలో రిలీజ్ అయిన లైలా, మజాకా సహా వివిధ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తండేల్ మాత్రం ప్రేక్షకులను అలరించింది.

ఆ తర్వాత మార్చి నెలలో పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ రెండే రెండు ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన కోర్ట్ ప్రేక్షకులను మెప్పించింది. మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మంచి హిట్ అయింది. దిల్ రుబా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రాబిన్ హుడ్ మూవీ డిజాస్టర్ గా మారింది.

ఏప్రిల్ లో ఓ రేంజ్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క మూవీ కూడా భారీ విజయం సాధించలేదు. ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాలు హిట్ అని టాక్ వినిపించినా.. వసూళ్ళ పరంగా నిరాశపరిచాయి. జాక్ మూవీ డిజాస్టర్ గా మారింది. సారంగపాణి జాతకం.. ఆడియన్స్ ను మెప్పించినా.. బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

ఆ తర్వాత మే నెల సూపర్ హిట్ హిట్ 3: ది థర్డ్ కేస్ తో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. భారీ వసూళ్లను రాబట్టింది. సింగిల్, శుభం సినిమాలు పర్వాలేదనిపించాయి. భైరవం, షష్టిపూర్తి సినిమాలు అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. మరోవైపు, జూన్ లో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఫస్ట్ రెండు వారాల్లో సందడి లేదు.

అయితే మూడో వారంలో కుబేర మూవీ రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అలరిస్తోంది. ఈ వరం రిలీజ్ అయిన కన్నప్ప మూవీ కూడా జోరుగా సాగిస్తోంది. మార్గన్ మూవీ మెల్లమెల్లగా ఎక్కుతోంది. మరి 2025 సెకండాఫ్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో.. ఎలా ఉంటాయో చూడాలి.