Begin typing your search above and press return to search.

2025 ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్: టాప్ గ్రాస్ లో పవన్ ఒక్కడే..

ఈసారి లిస్ట్ చూస్తుంటే మన టాలీవుడ్ అభిమానులకు కొంచెం నిరాశ కలిగించే విషయాలే ఉన్నాయి. ఎప్పుడూ టాప్ లో ఉండే మన సినిమాలు ఈసారి వెనుకబడ్డాయి.

By:  M Prashanth   |   16 Dec 2025 12:04 PM IST
2025 ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్: టాప్ గ్రాస్ లో పవన్ ఒక్కడే..
X

2025 సంవత్సరం చివరికి వచ్చేసింది. డిసెంబర్ 2 వారంలోపే బాక్సాఫీస్ లెక్కలు దాదాపు ఖరారు అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ తప్ప, ఈ నెలలో ఇక పెద్ద సినిమాలేవీ లేవు. అంటే ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లిస్ట్ ఇదే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఈసారి లిస్ట్ చూస్తుంటే మన టాలీవుడ్ అభిమానులకు కొంచెం నిరాశ కలిగించే విషయాలే ఉన్నాయి. ఎప్పుడూ టాప్ లో ఉండే మన సినిమాలు ఈసారి వెనుకబడ్డాయి.

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమా తన సత్తా చాటింది. రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 ఏకంగా 853 కోట్లు వసూలు చేసి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హిందీ సినిమా చావ 808 కోట్లతో రెండో స్థానంలో ఉంది. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా మరాఠా వీరుడు శంభాజీ చరిత్రతో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. టాప్ లిస్టులో ఈసారి ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే తమ ఆధిపత్యాన్ని చూపించాయి.

మన తెలుగు సినిమా విషయానికి వస్తే పరిస్థితి డల్ గానే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో మన సినిమాలు దుమ్మురేపుతాయని అనుకున్నా, ఈసారి టాప్ 10 లిస్టులో కేవలం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మాత్రమే చోటు దక్కించుకుంది. ఈ సినిమా 298 కోట్లు వసూలు చేసి హిట్ గా నిలిచింది. అది కూడా మేజర్ కలెక్షన్స్ అన్నీ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

ఈ ఏడాది మన స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు బాక్సాఫీస్ రేసులో లేకపోవడం టాలీవుడ్ కు పెద్ద లోటు. ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన వార్ 2 సినిమా భారీ అంచనాలతో వచ్చినా, 360 కోట్లు మాత్రమే తెచ్చి ప్లాప్ గా మిగిలిపోయింది. రజినీకాంత్ కూలీ సినిమా 516 కోట్లు వసూలు చేసినా యావరేజ్ అనిపించుకుంది. అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5 కూడా 292 కోట్లతో సరిపెట్టుకుంది.

పెద్ద సినిమాలు నిరాశ పరిచినా, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు మాత్రం ఈ ఏడాది అద్భుతాలు సృష్టించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సయారా సినిమా 575 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే మలయాళం నుంచి వచ్చిన లోక సినిమా 302 కోట్లు వసూలు చేసి అక్కడ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యానిమేషన్ ఫిల్మ్ మహా అవతార్ నరసింహ కూడా 326 కోట్లతో లాభాల పంట పండించింది.

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధురంధర్ సినిమా ఇప్పటివరకు 374 కోట్లు రాబట్టింది. ఇది ఇంకా ఆడుతోంది కాబట్టి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా చూస్తే 2025లో కన్నడ, హిందీ సినిమాలు డామినేట్ చేశాయి. మన తెలుగు నుంచి ఒక్క ఓజీ తప్పిస్తే చెప్పుకోదగ్గ విజయాలు లేవు.

2025 అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలు

1. కాంతార చాప్టర్ 1: 853.4 కోట్లు

2. చావా: 808.7 కోట్లు

3. సయారా: 575.8 కోట్లు

4. కూలీ: 516.7 కోట్లు

5. ధురంధర్: 374.3 కోట్లు

6. వార్ 2: 360.7 కోట్లు

7. మహా అవతార్ నరసింహ: 326.1 కోట్లు

8. లోక చాప్టర్ వన్: 302.1 కోట్లు

9. ఓజీ: 298.1 కోట్లు

10. హౌస్ ఫుల్ 5: 292.5 కోట్లు