Begin typing your search above and press return to search.

2024లో వ‌ర‌ల్డ్ టాప్ 10 సంపన్న నటులు

2023-24 సీజ‌న్‌కి ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితా తాజాగా రివీలైంది. ఇందులో భార‌త‌దేశానికి చెందిన కింగ్ ఖాన్ షారూఖ్ 5వ స్థానంలో నిల‌వ‌డం ఒక సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:25 PM GMT
2024లో వ‌ర‌ల్డ్ టాప్ 10 సంపన్న నటులు
X

2023-24 సీజ‌న్‌కి ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితా తాజాగా రివీలైంది. ఇందులో భార‌త‌దేశానికి చెందిన కింగ్ ఖాన్ షారూఖ్ 5వ స్థానంలో నిల‌వ‌డం ఒక సంచ‌ల‌నం కాగా, ప్ర‌ముఖ‌ హాస్యన‌టుడు, టెలివిజన్‌లో తన విజయవంతమైన కెరీర్ ద్వారా ఎదిగిన టైల‌ర్ పెర్రీ 1 బిలియన్ డాల‌ర్ల నికర సంప‌ద‌ల‌తో నం.1గా నిలిచాడు. టైలర్ పెర్రీ చలనచిత్ర నిర్మాణం, టీవీ నిర్మాణంలో అత్యంత విజ‌య‌వంత‌మైన నిర్మాత కం న‌టుడు. 1 బిలియన్ డాల‌ర్ల ఆస్తిప‌రుడుగా అత‌డు సంచ‌ల‌నం సృష్టించాడు.

జాబితాలో తదుపరి డ్వేన్ జాన్సన్ పేరు నిలిచింది. అతడి నికర ఆస్తుల‌ విలువ 800 మిలియన్ డాల‌ర్లు. మాజీ రెజ్లర్ డ్వేన్ నటుడిగా మారి తన నటన‌తో పాటు, వ్యాపారంలోను వినోద పరిశ్రమలో అపారమైన విజయాన్ని సాధించాడు. షారూఖ్ 770 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో ఐదో స్తానంలో నిలిచాడు.

ధ‌న‌వంతులైన న‌టుల జాబితాలో ఇతర ప్రముఖ స్టార్లు టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డౌనీ జూనియర్, విల్ స్మిత్ ఉన్నారు. 600 మిలియన్ డాల‌ర్ల‌ నుండి 350 మిలియన్ డాల‌ర్ల నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్న వారిలో వీరంతా ఉన్నారు.

2023లో ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటులు:

ర్యాంక్- నటులు

1 జెర్రీ సీన్‌ఫెల్డ్

2 టైలర్ పెర్రీ

3 డ్వేన్ జాన్సన్

4 షారూఖ్ ఖాన్

5 టామ్ క్రూజ్

6 రాబర్ట్ డి నీరో,

7 జాకీ చాన్

8 మెల్ గిబ్బన్

9 అమితాబ్ బచ్చన్

10 జార్జ్ క్లూనీ